CEC on EVM: 'బద్నాం చేస్తున్నారు..' EVM హ్యాకింగ్‌పై సీఈసీ షాకింగ్‌ కామెంట్స్‌!

కోరికలు నెరవేరని ప్రతిసారీ మనల్ని నిందించటం సరికాదంటూ సెటైర్లు వేశారు సీఈసీ రాజీవ్‌కుమార్‌. ఈవీఎంల హ్యాకింగ్‌పై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు కౌంటర్‌ వేశారు. ఈవీఎంలు 100శాతం వర్క్ చేస్తాయని ఎక్కడా కూడా పోరపాటు జరగడానికి ఛాన్స్‌ లేదని కుండబద్దలు కొట్టారు రాజీవ్.

New Update
CEC on EVM: 'బద్నాం చేస్తున్నారు..' EVM హ్యాకింగ్‌పై సీఈసీ షాకింగ్‌ కామెంట్స్‌!

Rajiv Kumar About EVM Hacking: ఎన్నికలు జరిగిన ప్రతీసారి EVMల గురించి తీవ్ర చర్చ జరుగుతది. ఈవీఎంల విషయంలో రాజకీయ పార్టీలు రెండుగా చీలిపోయి వాదించుకుంటాయి. ఈవీఎంలను తీసేసి బ్యాలెట్లు పెట్టాలని కాంగ్రెస్‌ లాంటి పార్టీలు నిత్యం డిమాండ్‌ చేస్తుంటాయి. అయితే ఈవీఎంలు సేఫ్‌ అని ఇటు కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు బీజేపీ (BJP) చెబుతుంటుంది. తాజాగా 18వ లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) సంబరానికి తెర లేచింది. ఎన్నికల తేదీలను ఈసీ (EC) ప్రకటించింది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ తేదీలను అనౌన్స్ చేశారు. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక తేదీల ప్రకటన తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు రాజీవ్‌ చెప్పిన సమాధానాలు నెట్టింట చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా ఈవీఎంల విషయంలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సెటైర్లు వేశారు రాజీవ్.

రాజీవ్‌ ఏం అన్నారంటే?
ఈవీఎంలపై కొన్ని రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయా లేదా అనే ప్రశ్నకు ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ విలేకరుల సమావేశంలో సమాధానమిచ్చారు. 'షాయరీ చెప్పిన తర్వాత నేను ఈ మాటలు చెప్పడం లేదు. ఈవీఎం ఈ మాటలు చెబుతోంది. 100 శాతం ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి' అని రాజీవ్ కుమార్ తెలిపారు. ఆయన షాయరీ అనే పదాన్ని ఉపయోగించగానే ప్రెస్‌మీట్‌లో అంతా ఒక్కసారిగా నవ్వారు.

'ఈవీఎంల గురించి ప్రశ్న వస్తుందని తెలుసు. అందుకే రాత్రే నేను ఓ కవితను రాసిపెట్టుకున్నా. ప్రతిసారి మమ్ముల్ని మీరు బద్నాం చేస్తున్నారు.
అయినా.. ఏ ఒక్కదాన్ని నిరూపించలేకపోతున్నారు. నాపై మీరు ఎన్ని ఆరోపణలు చేసినా నేను మాత్రం మిమ్ముల్ని గెలిపిస్తూనే ఉన్నాను. ఇంకా నాపై ఎన్ని రోజులు ఆరోపణలు చేస్తుంటారు. ఈవీఎంలు వంద శాతం బాగా వర్క్ చేస్తాయి. ఎక్కడా కూడా పోరపాటు జరగడానికి వీల్లేదు. రెండేళ్లుగా ఈవీఎంలను మరింత పకడ్బందీగా చేశాం' అని రాజీవ్‌ చెప్పుకొచ్చారు.

రాజీవ్ కుమార్‌ను ఈవీఎంలపై ప్రశ్నలు అడిగినప్పుడు, అతను ఈవీఎంలలో తప్పులు కనుగొన్న వారిని అవహేళన చేస్తూ తన కవితలోని కొన్ని పంక్తులను చదివారు. 'కోరికలు నెరవేరని ప్రతిసారీ మనల్ని నిందించటం సరికాదు. విధేయత అనేది ఒకరి నుంచి వచ్చేది కాదు. రిజల్ట్స్ వస్తే మనం కూడా వాటికి(ఈవీఎం) అతుక్కోనట్లే..' అని సెటైర్లు వేశారు రాజీవ్‌కుమార్‌.


మొత్తం ఏడు దశల్లో:
లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి ఏడు దశల్లో (7 Phases) జరగనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. తొలి విడత ఏప్రిల్ 19న, రెండో దశ ఏప్రిల్ 26న, మూడో దశ మే 7న, నాల్గవ దశ మే 13న, ఐదవ దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడవ దశ జూన్ 1న జరుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో ఏప్రిల్ 19న, ఆంధ్రప్రదేశ్‌లో మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒడిశా అసెంబ్లీకి మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక హర్యానా, హిమాచల్, జార్ఖండ్, యూపీలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతాయి.

Also Read: మోగిన ఎన్నికల నగారా.. ఎలక్షన్‌ షెడ్యూల్‌ అవుట్.. తేదీలివే!

Advertisment
Advertisment
తాజా కథనాలు