BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టో కమిటీ ప్రకటన.. అధ్యక్షుడు ఎవరంటే?

రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది బీజేపీ.ఎన్నికల మేనిఫెస్టో ప్యానెల్ కన్వీనర్‌గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను నియమించగా.. ఆమె క్యాబినెట్ సహచరుడు, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కో-కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

New Update
BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టో కమిటీ ప్రకటన.. అధ్యక్షుడు ఎవరంటే?

లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో కమిటీని ప్రకటించింది. ఈ జాబితాలో ఇటీవల ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన పలువురు నేతల పేర్లు ఉన్నాయి. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కమిటీని ప్రకటించారు. ఈ మేనిఫెస్టో కమిటీకి రాజ్‌నాథ్ సింగ్ ఛైర్మన్‌గా ఉండగా, నిర్మలా సీతారామన్ కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఈ కమిటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన 27 మంది సభ్యులు ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన పీయూష్ గోయల్‌ను కో-కన్వీనర్‌గా నియమించారు. అటు అర్జున్ ముండా, భూపేంద్ర యాదవ్, అర్జున్‌రామ్ మేఘవాల్ కూడా కమిటీలో ఉన్నారు.

publive-image

ఈ కమిటీలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ కూడా ఉన్నారు. బీహార్ నుంచి రవిశంకర్ ప్రసాద్, సుశీల్ మోదీలను సభ్యులుగా చేశారు. అదే సమయంలో, OP ధంఖర్, మంజిందర్ సింగ్ సిర్సా కూడా ఇందులో ఉన్నారు.

Also Read: అధికారంలోకి వస్తే 9 గ్యారెంటీలు, ప్రత్యేక హోదా

Advertisment
Advertisment
తాజా కథనాలు