Gambhir: టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్‌గంభీర్‌.. జై షా అధికారిక ప్రకటన!

టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్‌గంభీర్‌ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా అధికారికంగా ప్రకటించారు. మిస్టర్‌కు స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉందంటూ పోస్ట్ పెట్టారు. జులై 27 నుంచి శ్రీలంకతో జరగనున్న 3 టీ20ల సిరీస్ తో గంభీర్ ప్రయాణం మొదలుకానుంది.

New Update
Gambhir: టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్‌గంభీర్‌.. జై షా అధికారిక ప్రకటన!

Gautam Gambhir: టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్‌గంభీర్‌ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా (Jay Shah) అధికారికంగా ప్రకటించారు. మిస్టర్‌కు స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉందంటూ పోస్ట్ పెట్టారు.

'భారత క్రికెట్ జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా.. మిస్టర్‌కి స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది. ఆధునిక క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందింది. గౌతమ్ ఈ మారుతున్న ప్రకృతి దృశ్యాన్ని పరిశీలించి చూశాడు. గౌతమ్ తన కెరీర్‌లో వివిధ పాత్రల్లో రాణించి, కష్టాలను తట్టుకుని, భారత క్రికెట్‌ను ముందుకు నడిపించగల ఆదర్శవంతమైన వ్యక్తి అని నాకు నమ్మకం ఉంది. టీమ్ ఇండియా పట్ల అతని స్పష్టమైన దృష్టి, అతని అనుభవం కోచింగ్ పాత్రను స్వీకరించడానికి సంపూర్ణంగా సరిపోతుంది. BCCI అతనికి పూర్తిగా మద్దతు ఇస్తుంది' అంటూ రాసుకొచ్చాడు.

ఇక ద్రావిడ్ పదవీ కాలం ముగియడంతో ఈ నెలాఖరులో శ్రీలంకతో ప్రారంభమయ్యే టీ20, వన్డేల సిరీస్‌లకు కొత్త కోచ్‌ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇప్పటికే ప్రకటించాడు. అన్నట్లుగానే ఈ రోజు అధికారిక ప్రకటన చేశాడు. ఇక 27 నుంచి శ్రీలంక, భారత్ మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.

టీమ్ఇండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం 2024 టీ20 ప్రపంచకప్‌తో ముగిసిన సంగతి తెలిసిందే. కాగా బెంగళూరులోని స్థానిక క్రికెట్ అకాడమీలో యువ క్రికెటర్లు, కోచింగ్ సిబ్బంది రాహుల్ ద్రవిడ్‌ కు ఘన స్వాగతం పలికారు. యువ క్రికెటర్లు బ్యాట్లను పైకి ఎత్తి 'గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌' ఇచ్చారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Advertisment
తాజా కథనాలు