Gautam Adani: 100 బిలియన్ క్లబ్‌ లోకి మరోసారి అదానీ!

దాదాపు సంవత్సర కాలం తరువాత గౌతమ్‌ అదానీ 100 బిలియన్ డాలర్ల ఎలైట్‌ క్లబ్‌ లిస్ట్‌ లో స్థానం దక్కించుకున్నారు. బుధవారం నాడు ఒక్కరోజే అదానీ ఆస్తి విలువ సుమారు 2.7 బిలియన్‌ డాలర్లు పెరిగి... 100. 7 బిలియన్‌ డాలర్ల వద్ద స్థిరపడింది.

New Update
Gautam Adani: 100 బిలియన్ క్లబ్‌ లోకి మరోసారి అదానీ!

Gautam Adani Enters $100 Billion Club: పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ సంపద మరోసారి రూ. 100 బిలియన్లకు  చేరుకుంది. దాదాపు సంవత్సర కాలం తరువాత ఆయన 100 బిలియన్ డాలర్ల ఎలైట్‌ క్లబ్‌ లిస్ట్‌ లో స్థానం దక్కించుకున్నారు. బుధవారం నాడు ఒక్కరోజే అదానీ ఆస్తి విలువ సుమారు 2.7 బిలియన్‌ డాలర్లు పెరిగి... 100.7 బిలియన్‌ డాలర్ల వద్ద స్థిరపడింది.

హిడెన్ బర్గ్‌(Hindenburg) పరిణామం తరువాత తొలిసారి అదానీ ఆస్తి 100 బిలియన్లకు చేరింది. గతేడాది అదానీ ఎంటర్ప్రైజెస్‌ లిమిటెడ్ 130 శాతం లాభాన్ని నమోదు చేసింది. గత వారం కూడా సంస్థ లాభాల బాటలో పయనించచడంతో వరుసగా ఎనిమిది రోజుల నుంచి లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. దీంతో అదానీ (Gautam Adani) సందప ఒక్కసారిగా పెరిగింది.

Also Read: ఈ సీజన్ లో దొరికే రేగిపండ్లను తినడం వల్ల ఫ్లూ వంటి వ్యాధులను తరిమికొట్టోచ్చు! 

ఇదిలా ఉంటే బ్లూమ్ బర్గ్‌ బిలియనీర్స్ ఇండెక్స్‌ తెలిపిన వివరాల ప్రకారం అదానీ ప్రపంచంలోనే 12 వ ధనవంతుడిగా ఉన్నారు. మన దేశ అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani)  ప్రపంచంలోనే 11 వ అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. జనవరి నెల చివరిలోనే ముకేశ్‌ ఆస్తి విలువ రికార్డు స్థాయికి చేరుకోగా..అదానీ ఆస్తి విలువ మాత్రం 50 బిలియన్‌ డాలర్లు తక్కువగా ఉంది.

హిడెన్‌ బర్గ్‌ నివేదిక ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పటి నుంచి అదానీ ఆస్తుల విలువ అంతకంతకు పడిపోయి 37. 7 బిలియన్‌ డాలర్లుకు చేరుకుంది. ఒకానొక సమయంలో అయితే అదానీ మార్కెట్‌ విలువ సుమారు 150 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. తరువాత కంపెనీ నష్టాల నుంచి కోలుకోవడానికి సుమారు 7 నుంచి 8 నెలల సమయం పట్టింది.

ఏది ఏమైనప్పటికీ గతేడాది ఎక్కువ సంపదను కోల్పోయిన అదానీ గ్రూప్‌ (Adani Group) ఈ ఏడాది మాత్రం తన దూకుడును ప్రదర్శిస్తుంది. ఈ రెండు నెలల కాలంలోనే సుమారు 16. 4 బిలియన్‌ డాలర్ల సంపదను అదానీ గ్రూప్ పెంచుకుంది.

Advertisment
తాజా కథనాలు