Cooking on Gas Stove Leads To Asthma : గ్యాస్(Gas) లేదా డీజిల్(Diesel) తో నడిచే వాహనాల కంటే గ్యాస్ స్టవ్(Gas Stove) పై వంట చేయడం వల్ల గాలిలోకి ఎక్కువ నానోపార్టికల్స్ విడుదలవుతాయి. ఇది ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అమెరికాలోని పర్డ్యూ యూనివర్సిటీ చేసిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన పర్డ్యూస్ లైల్స్ స్కూల్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్‌లో ప్రొఫెసర్ బ్రాండన్ బర్ ప్రకారం.. ఇంటి లోపల, ఆరుబయట గ్యాస్ స్టవ్‌పై వంట చేయడం ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యానికి మూలంగా ఉంది.
20 నిమిషాల్లోనే అంతా జరిగిపోతుంది:
గ్యాస్ స్టవ్‌పై వంట చేయడం వల్ల పెద్ద మొత్తంలో చిన్న నానోపార్టికల్స్ విడుదలవుతాయి. ఇవి ఈజీగా శ్వాసకోశ వ్యవస్థలోకి ప్రవేశిస్తాయి. PNAS Nexus జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ఈ విషయాన్ని చెబుతోంది. ఊపిరితిత్తులలో సుమారు 10 బిలియన్ నుంచి ఒక ట్రిలియన్ కణాలు పేరుకుపోతాయని మోడల్ చూపించింది. ఈ పరిమాణం పిల్లలకు మరింత ప్రమాదకరం. వేడినీరు లేదా గ్యాస్ స్టవ్‌పై కాల్చిన చీజ్ శాండ్‌విచ్ లేదా మజ్జిగ పాన్‌కేక్‌లను తయారు చేసిన కేవలం 20 నిమిషాల్లోనే ట్రిలియన్ల కొద్దీ కణాలు విడుదలవుతున్నాయని అధ్యయనం కనుగొంది.
కారు పొగలు కంటే డేంజర్:
జర్మన్ కంపెనీ గ్రిమ్ ఏరోసోల్ టెక్నిక్, డ్యూరాగ్ గ్రూప్(Durag Group) సభ్యుడు అందించిన అత్యాధునిక గాలి నాణ్యత పరికరాలను ఉపయోగించి ఈ పరిశోధకులు చేశారు. గ్యాస్ స్టవ్‌పై ఆహారాన్ని వండేటప్పుడు ఈ చిన్న కణాలను ఒక నానోమీటర్ వరకు కొలవగలిగారు . ఒక కిలోగ్రాము వంట ఇంధనానికి 10 క్వాడ్రిలియన్ నానోక్లస్టర్ ఏరోసోల్ కణాలు విడుదలవుతాయని పరిశోధకులు కనుగొన్నారు. ఇవి డీజిల్ ఇంజిన్ వాహనాలు ఉత్పత్తి చేసే కణాల కంటే ఎక్కువ. రద్దీగా ఉండే రోడ్డుపై నిలబడి కారు పొగలు పీల్చడం కంటే ఇంట్లో గ్యాస్ స్టవ్‌పై ఆహారాన్ని వండేటప్పుడు 10 నుంచి 100 రెట్లు ఎక్కువ నానోక్లస్టర్ ఏరోసోల్‌లు పీల్చుతున్నాం. దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు.. ఇవి ఎంత ప్రాణాంతకమో!
Also Read : మనసులను లాక్ చేసే లిప్స్.. లేలేత అధరాల కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి!