Garlic Price : అమ్మో వెల్లుల్లి ఘాటు.. మామూలుగా లేదు.. రికార్డు రేటు!

మనదేశంలో ఎక్కువగా పండే వెల్లుల్లి కొనుక్కోవాలంటే మాత్రం మంట పుట్టిస్తోంది. రిటైల్ మార్కెట్లో కిలో వెల్లుల్లి 600 రూపాయలు ఉంది. అదే వెల్లుల్లి మన దేశం నుంచి రూ.51.49లకు ఎగుమతి అయిపోతోంది. కేంద్ర ప్రభుత్వం వెల్లుల్లి విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

Garlic Price : అమ్మో వెల్లుల్లి ఘాటు.. మామూలుగా లేదు.. రికార్డు రేటు!
New Update

Garlic Price @600 : వెల్లుల్లి.. ఇది లేనిదే మన వంటింట్లో ఘుమఘుమలు లేనట్టే. మన వంటల మాసాలాల్లో తప్పనిసరిగా వెల్లుల్లి ఉండాల్సిందే. మసాలాలు మాత్రమే కాదు.. చట్నీ చేసుకున్నా వెల్లుల్లి పోపు లేకపోతే ఎంతో వెలితిగానే ఉంటుంది రుచి. మనదేశంలో వెల్లుల్లి వాడకం ఎంత ఎక్కువ ఉంటుందో.. దాని ఉత్పత్తి కూడా అంతే ఎక్కువ. ప్రపంచంలోనే వెల్లుల్లిని పండించే దేశాల్లో మన దేశం రెండో అతిపెద్ద దేశం. అయినా ప్రస్తుతం మనకి వెల్లుల్లి కొనడం కాదు.. పేరు వింటేనే దాని రేటు ఘాటుకి కళ్ళు ఎర్రబడిపోతున్నాయి. అవును..వెల్లుల్లి ధరలు(Garlic Price) చుక్కల్లోకి వెళ్లాయి. ప్రస్తుతం వెల్లుల్లి రిటైల్ ధర కేజీకి 600 రూపాయలకు పైగా ఉంది. 

అయితే, మన దేశంలో అంత ఎక్కువ వెల్లుల్లి పంట ఉన్నప్పటికీ దానిలో అధిక భాగం ఎగుమతి అయిపోతుంది. మం దేశం నుంచి ఎగుమతి అయ్యే పంటల్లో వెల్లుల్లికి(Garlic Price) ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ లెక్కలు చూస్తే ఆ విషయం అర్ధం అవుతుంది. మన దేశం నుంచి 2023-24 ఆర్ధిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో అంటే, 2023 ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు మొత్తం  62026  టన్నుల వెల్లుల్లి ఎగుమతి అయింది. ఇది ఎగుమతులలో ఆల్ టైమ్ రికార్డ్ . ఇంతకు ముందు ఏ ఆర్థిక సంవత్సరంలోనూ ఇంత మొత్తంలో వెల్లుల్లి ఎగుమతి కాలేదు . 2022-23  ఆర్థిక సంవత్సరంలో  దేశం  నుండి దాదాపు 57  వేల టన్నుల వెల్లుల్లి(Garlic Price) ఎగుమతి చేశారు. ఎగుమతులకు సంబంధించి అప్పటికి అది రికార్డు అయితే ఈ ఏడాది అన్ని రికార్డులు బద్దలయ్యాయి .

Also Read : మళ్ళీ బంగారం ధరలు పైకి.. భారీగా తగ్గిన వెండి.. 

ఈ ఆర్ధిక సంవత్సరం  ఏప్రిల్ - అక్టోబర్ మధ్య కాలంలో  పరిమాణం పరంగా 62026  టన్నుల వెల్లుల్లి ఎగుమతి కాగా ,  ధర(Garlic Price) పరంగా ఈ సంఖ్య  రూ. 318.33  కోట్లుగా దీనిని చెప్పవచ్చు.  ఈ నేపథ్యంలో కిలో ఎగుమతి ధర  రూ.51.49కి చేరింది. అంటే, మనం కిలో 500-600 మధ్య కొంటున్న కిలో వెల్లుల్లి.. కేవలం రూ. 51.49 కి ఎగుమతి అయిపోతోంది. దీనిని బట్టి చూస్తే వెల్లుల్లి(Garlic Price) పండిస్తున్న మనదేశంలో మనం పది నుంచి పదకొండు రెట్లు ఎక్కువ పెట్టి కొంటున్నాం. ఇంత అధ్వాన్నంగా వెల్లుల్లి విషయంలో మనదేశంలో పరిస్థితి ఉంది. 

భారతీయులు  కిలోకు రూ. 500  చెల్లిస్తున్న వెల్లుల్లి దేశం నుండి కిలో ధర  రూ. 51.49  కి మాత్రమే ఎగుమతి అవుతుంది .

ఈ సంవత్సరం కూడా, ఎగుమతిలో సగానికి పైగా బంగ్లాదేతింటున్నారు. 2022-23  ఆర్థిక సంవత్సరంలో  దేశం నుంచి ఎగుమతి చేసిన  57346  టన్నుల వెల్లుల్లిలో  28244  టన్నులు బంగ్లాదేశ్‌కు ఎగుమతి అయ్యాయి . బంగ్లాదేశ్‌తో పాటు మలేషియా ,  వియత్నాం..  థాయ్‌లాండ్‌లు భారతీయ వెల్లుల్లిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. 

Watch this Interesting News :

#india #garlic #market-price #garlic-price
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe