Ganta Srinivasa Rao: మరికొన్ని నెలల్లో ఏపీలో ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) మరో వైపు లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సర్వేలు ఆధారంగా ఎన్నికల్లో గెలిచేందుకు గెలుపు గుర్రాలకే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నాయి అని ప్రధాన రాజకీయ పార్టీలు. అయితే.. ఈ సారి ఏపీలో సీఎం జగన్ (CM Jagan) ను ఓడించకపోతే తమ భవిష్యత్ ఉందని భావిస్తున్న టీడీపీ.. అభ్యర్థుల విషయంలో చాలా కీలకంగా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇదిలా ఉండగా టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆ పార్టీ కేటాయించే సీట్ పై చర్చ నడుస్తోంది.
ALSO READ: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దారెటు?
మంత్రి బొత్సనే టార్గెట్..
విశాఖ చీపురుపల్లి టీడీపీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు పేరును ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణను (Botsa Satyanarayana) ఈ ఎన్నికల్లో ఓడించేందుకు టీడీపీ 'ఆపరేషన్ చీపురుపల్లి' స్టార్ట్ చేసినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జోరందుకుంది. బొత్సకు చెక్ పెట్టేందుకు బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న గంటా శ్రీనివాసరావే (Ganta Srinivasa Rao) కరెక్ట్ అని టీడీపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అప్పుడే ఫైనల్..
గంటా శ్రీనివాసరావు పేరు దాదాపు ఖరారు ఐంనా.. చీపురుపల్లి నియోజకవర్గంలో మరోమారు సర్వే చేసిన తర్వాతే తమ నిర్ణయం ప్రకటించనున్నారు టీడీపీ బాస్. గంటాతోపాటు మాజీ మంత్రి నారాయణతో ఎప్పటికప్పుడు వ్యూహకర్త రాబిన్‌శర్మ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చీపురుపల్లి నుంచి మూడు సార్లు విజయం సాధించి తనకు ప్రత్యర్థే లేకుండా చేసుకున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 27 వేల మెజారిటీతో ఘన విజయం సాధించారు బొత్స. మరోవైపు టీడీపీ కూడా చీపురుపల్లి నియోజకవర్గానికి 9 సార్లు ఎన్నికలు జరిగితే ఆరు సార్లు విజయం సాధించింది. ఈసారి ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో పసుపు జెండా ఎగురవేయాలని టీడీపీ భావిస్తోంది.