TS : పైన ఇసుక.. లోన గంజాయ్.. పుష్పను బీట్ చేస్తున్న స్మగ్లర్లు..!

తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు గంజాయి స్మగ్లర్ల ఆటకట్టించారు. చింతూరు నుంచి ట్రాక్టర్‌ అడుగు భాగంలో గంజాయి ప్యాకెట్లను అమర్చి.. పైన ఇసుకను కప్పి తరలిస్తుండగా భద్రాచలం గోదావరి వంతెన వద్ద పోలీసులు పట్టుకున్నారు. భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

New Update
TS : పైన ఇసుక.. లోన గంజాయ్.. పుష్పను బీట్ చేస్తున్న స్మగ్లర్లు..!

Khammam : గంజాయి (Ganja) స్మగ్లర్లు రూట్ మార్చారు. పుష్ప (Pushpa) సినిమా తరహాలో గంజాయిను తరలిస్తున్నారు. అయితే, తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు గంజాయి స్మగ్లర్ల ఆటకట్టించారు. ఆంధ్రా-ఒరిస్సా బార్డర్‌ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

Also Read: కారు బీభత్సం.. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని..

చింతూరు నుంచి ట్రాక్టర్‌ అడుగు భాగంలో గంజాయి ప్యాకెట్లను అమర్చి.. పైన ఇసుకను కప్పి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. భద్రాచలం (Bhadrachalam) గోదావరి వంతెన వద్ద ట్రాక్టర్‌ను ఛేజ్ చేసి మరి గంజాయి రవాణాను ఎక్సైజ్ పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే అలర్ట్ అయిన నిందితుడు ట్రాక్టర్‌ను వదిలేసి పరార్ అయ్యాడు.

Also Read: దారుణం.. ట్యూషన్ మాస్టర్ అని నమ్మించిన యువకుడు.. బాలికలను ఎత్తుకెళ్లి..

ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్‌ పోలీసులు భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కాగా, అధికారులు గంజాయి, డ్రగ్స్‌ నియంత్రణపై అవగాహన కల్పిస్తున్నా గంజాయి స్మగ్లర్లు ఏ మాత్రం తగ్గడం లేదు. తమ దారి తమదే అంటూ రూట్లు మార్చి మారీ  గంజాయిను తరలిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు