Gangster Patankar: మహారాష్ట్రలోని నాసిక్ లో ఒక గ్యాంగ్ స్టర్ జెయిలులో ఉన్నాడు. అతనికి బెయిల్ వచ్చింది. దీంతో బయటకు వచ్చాడు. అతను బయటకు రావడాన్ని సంబరంగా చేయాలని అభిమానులు డిసైడ్ అయ్యారు. దీంతో పెద్ద ర్యాలీ ఏర్పాటు చేసి "కమ్‌బ్యాక్" అంటూ హంగామా సృష్టించారు. సదరు గ్యాంగ్ స్టర్ కూడా తన అభిమానులు చేసిన ఏర్పాట్లను చూసి మురిసిపోయాడు. దీంతో వారితో పాటు హంగామా మొదలెట్టాడు. ఓపెన్ రూఫ్ కారులో అందరినీ ఉత్సాహపరుస్తూ అభివాదం చేస్తూ ర్యాలీలో ముందుకు కదిలాడు.
ఇంతవరకూ బాగానే ఉంది. ఇంత హంగామా జరుగుతుంటే, అభిమానులు ఊరకనే ఉండరు కదా. అసలే సోషల్ మీడియా లో లైక్ లు షేర్ల లెక్కల యుగం ఇది. మనోడి ఊరేగింపును లైవ్ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఫుల్ వైరల్ అయిపోయింది. ఎంతలా అంటే.. గ్యాంగ్ స్టర్ పాటంకర్ ఇంటికి వచ్చేసరికి పోలీసులు సంకెళ్లతో సహా రెడీగా ఉండేంతగా.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు అక్కడికక్కడే మృతి!
Gangster Patankar: అవును. పాపం బెయిల్ తీసుకుని ఇంటికి చేరిన వెంటనే మన గ్యాంగ్ స్టర్ ను పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఈసారి అతనితో పాటు మరికొందరు అతని ఫ్యాన్స్ ను కూడా పట్టుకెళ్ళి మనోడికి తోడుగా లోపలేశారు. ఎందుకు అని అనుకుంటున్నారా? అక్కడ అనధికారిక ర్యాలీని నిర్వహించి, అల్లకల్లోలం సృష్టించినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి తీసుకెళ్లి కోర్టులో అప్పచెప్పారు. కోర్టు రిమాండ్ విధించింది. అంతకుముందు పాటంకర్ పై హత్యాయత్నం, దొంగతనం, హింస వంటి అనేక పోలీసు కేసులు వున్నాయి. వాటి విషయంలోనే కొన్నాళ్ల క్రితం జైలుకి వెళ్ళాడు. మొత్తమ్మీద గట్టి ప్రయత్నాలు చేసి బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చాడు. కానీ, పాపం అభిమానుల అత్యుత్సాహంతో జైలు నుంచి ఇంటికి కూడా చేరకుండానే మళ్ళీ కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.
ఇక్కడ గ్యాంగ్ స్టర్ పాటంకర్ జైలు నుంచి బయటకు వచ్చి చేసిన హంగామా వీడియోను చూడొచ్చు.
Also Read: వందేళ్ల క్రితం ఒలింపిక్స్ లో క్రికెట్.. మెడల్ కొట్టింది ఈ దేశమే!