గోదారోళ్ల యాసలో అదరగొట్టిన విశ్వక్‌సేన్ టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ ఇప్పటివరకు తెలంగాణ యాస, భాషలో అదరగొట్టాడు. తొలిసారిగా గోదావరి యాసలో ఓ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో నటిస్తున్నాడు. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. By BalaMurali Krishna 31 Jul 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి యూట్యూబ్ ట్రెండింగ్‌లో గ్లింప్స్.. యువ నటుడు విశ్వక్‌సేన్ 11వ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ వచ్చేసింది. ఈ సినిమాకు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే పేరును ఖరారుచేశారు. ఇప్పటివరకు తెలంగాణ యాస, భాషలో ఎక్కువగా నటించిన విశ్వక్ ఈ మూవీలో తొలిసారిగా గోదావరి యాసలో మాట్లాడుతూ రఫ్ అండ్ మాస్ లుక్‌లో అదరగొట్టాడు. గ్లింప్స్ చూస్తుంటే ఈ సినిమా గోదావరి నేపథ్యంలో సాగే పొలిటికల్ మాస్ డ్రామాగా సాగనుందని తెలుస్తోంది. 'మేము గోదారోళ్ళం.. మాటొకటే సాగదీస్తాం, తేడా వస్తే.. నవ్వుతూ నరాలు తీసేస్తాం' అంటూ విశ్వక్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ కుర్రాడు అయిన విశ్వక్ ఇలా గోదావరిపై సినిమా, అది కూడా మాస్ యాక్షన్ మూవీ చేస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్' యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఉంది. కీలకపాత్రలో నటి అంజలి.. సితార సంస్థ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీతో పాటు విశ్వక్ కూడా నిర్మిస్తున్న ఈ సినిమాకు కృష్ణ చైతన్య కథ, మాటలు, దర్శకత్వం అందిస్తున్నారు. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ అంజలి కీలకపాత్రలో కనిపించనుంది. అలాగే సాయి కుమార్, నాజర్, గోపరాజు రమణ సీనియర్ ఆర్టిస్టులు కూడా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం ఇస్తున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య ఇంతకు ముందు నారా రోహిత్‌తో 'రౌడీ ఫెలో' అనే చిత్రం డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత నితిన్‌తో 'ఛల్ మోహన్ రంగా' తీశాడు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. Get ready to be immersed in a world of raw emotions 💥 Here's the first glimpse into the world of #GangsofGodavari 🌊👊🏻 ▶️https://t.co/CLlNt08ivf@VishwakSenActor #KrishnaChaitanya @thisisysr @vamsi84 @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios @adityamusic pic.twitter.com/7Jgtu7Axpc — VishwakSen (@VishwakSenActor) July 31, 2023 వరుస సినిమాల జోరు.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విశ్వక్ సేన్ ఇటీవలే తన కెరీర్‌లో 10వ సినిమాను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రవితేజ ముళ్ళపూడి డైరెక్ట్ చేయనున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇటీవల విడుదలై మంచి హిట్ అందుకున్న 'ధమ్కీ' సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. రూ.8కోట్లతో తీసిన ఈ సినిమాకు దాదాపు రూ. 2.50కోట్ల మేర లాభాలు వచ్చాయి. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు విశ్వక్‌సేన్ దర్శకత్వం వహించడం విశేషం. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి