WIRAL: మృత్యువు అంచుల వరకు వెళ్లిన ఓ యువకుడి వీడియో వైరల్!

మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు ఊహించలేరు. కానీ కొన్ని సార్లు చావు చివర అంచులకు వెళ్లి కూడా కొందరు తప్పించుకున్న ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి ఓ ఘటన బెంగళూరు లో జరిగింది. అలాంటి వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరలైంది.

WIRAL: మృత్యువు అంచుల వరకు వెళ్లిన ఓ యువకుడి వీడియో వైరల్!
New Update

కర్ణాటక రాజధాని బెంగళూరులో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఓ స్కూటీపై వెళ్తున్న వ్యక్తిపై ఓ గంగిరెద్దు సడెన్‌గా దాడి చేసింది. ఓ మహిళ గంగిరెద్దును పట్టుకుని రోడ్డుపై వెళ్తుండగా ఎదురుగా రెడ్‌ స్కూటీపై ఓ వ్యక్తి వచ్చాడు. ఒక్కసారిగా బెదిరిపోయిన గంగిరెద్దు ఆ వ్యక్తిపై దాడి చేసింది.  ఒక్కసారిగా బెదిరిపోయిన గంగిరెద్దు ఆ వ్యక్తిపై దాడి చేసింది. రోడ్డు పక్కన నడుస్తున్న గంగిరెద్దు రోడ్డు మీదకు పరిగెత్తుకొచ్చి బైకర్‌ను పొడిచింది. ఆ తర్వాత బైక్‌పై నుంచి అమాంతం దూకి పరుగు తీసింది.

ఈ దాడితో అదే సమయంలో అటుగా వచ్చిన లారీ కింద బైకర్‌ పడిపోయాడు. అయితే లారీ డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేయడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. లేదంటే లారీ వెనుక టైర్ల కింద బైకర్‌ తల నుజ్జునుజ్జయ్యేది. ఈ షాకింగ్‌ ఇన్సిడెంట్‌ బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్‌లో చోటుచేసుకుంది. ఘటనలో బైకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్కూటీ కూడా స్వల్పంగా దెబ్బతిన్నది. బైకర్‌పై గంగిరెద్దు దాడికి సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.

#accident-vidio-wiral
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe