Gang War with Cars: ఇది సినిమా కాదు రియల్.. ఇలాంటి గ్యాంగ్ వార్ ఎక్కడా చూసి ఉండరు.. 

రెండువర్గాల ఎదురెదురుగా వెళ్లి కొట్టుకోవడం చూసి ఉంటారు. కానీ కార్లతో ఫైట్ చేసిన గ్యాంగ్ వార్ ఎప్పుడైనా చూశారా? అది చూడాలంటే ఈ ఆర్టికల్ లోని వీడియో చూడాల్సిందే. ఇది కర్ణాటకలోని ఉడిపిలో జరిగింది. సంఘటన పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

Gang War with Cars: ఇది సినిమా కాదు రియల్.. ఇలాంటి గ్యాంగ్ వార్ ఎక్కడా చూసి ఉండరు.. 
New Update

Gang War with Cars: ఒక్కోసారి కొన్ని సంఘటనలు చూస్తే మనం సభ్య సమాజంలోనే ఉన్నామా అని అనుమానం వస్తుంది. అలాగే, ఒక్కోసారి భయం కూడా వేస్తుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాకా ఎక్కడ ఎటువంటి చిన్న సంఘటన జరిగినా అది సమాజం దృష్టికి చాలా తొందరగా వచ్చేస్తోంది. టెక్నాలజీ పెరగడం.. ప్రజలకు సోషల్ మీడియా అవగాహన ఎక్కువగా ఉండడంతో వెలుగులోకి వస్తున్న కొన్ని సంఘటనల వీడియోలు ఒళ్ళు గుగుర్పొడిచేలా ఉంటున్నాయి. తాజాగా ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

Gang War with Cars: కర్ణాటక కోస్తా తీరంలో ఉడిపి పట్టణం పేరు వినని వారుండరు. అక్కడ రెండు వర్గాల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ కు సంబంధించిన ఒక వీడియో అక్కడి స్థానిక డాక్టర్ దుర్గాప్రసాద్ హెగ్డే  Xలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో రాత్రి సమయంలో పెద్ద రోడ్డుమీద జరిగిన ఒక ఘటనను చూపిస్తోంది. రెండు స్విఫ్ట్ కార్లలో వచ్చిన కొందరు మనుషులు కార్లతోనే ఫైట్ చేసుకున్నారు. మొదట ఒక నల్ల కారు మెయిన్ రోడ్డుపై వేగంగా వచ్చి ఆగింది. అప్పటికే పక్కనే ఉన్న రోడ్డు మీద ఒక తెల్ల కారు ఆగి ఉంది. అక్కడ ఆగి ఉన్న ఆ తెల్ల కారు సడన్ గా రివర్స్ లో వచ్చి మెయిన్ రోడ్డు మీద ఆగిన తెల్ల కారును ఢీకొట్టింది. దీంతో వెంటనే నల్ల కారుకు సంబంధిచిన వ్యక్తులు ఒక్కసారిగా రాడ్లు.. రాళ్ళూ పట్టుకుని తెల్లకారువైపు దూసుకు వెళ్లారు. వాళ్ళని తప్పించుకుంటూ వేగంగా ముందుకు వెళ్ళింది తెల్ల కారు. ఆ తరువాత అకస్మాత్తుగా ఆగి.. వెంటనే రివర్స్ లో వచ్చి మెయిన్ రోడ్డుపై నల్లకారుకు ఎదురుగా నిలిచింది. ఈలోపు నల్లకారుకు సంబంధించిన వ్యక్తి ఒకరు తెల్ల కారువైపు వెళ్ళసాగాడు. సరిగ్గా అదేసమయంలో తెల్లకారు వేగంగా కదిలి ఆ వ్యక్తిని ఢీ కొట్టి ముందుకు దూసుకుపోయింది. కారు ఢీ కొట్టడంతో ఆ వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. అతన్ని ఢీ కొట్టిన తెల్ల కారు కొంచెం ముందుకు వెళ్లి ఆగి.. తరువాత మళ్ళీ రివర్స్ లో వచ్చి పక్కరోడ్డులోకి వెళ్ళింది. 

Gang War with Cars; ఈ సంఘటన మొత్తం వీడియోను డాక్టర్ దుర్గాప్రసాద్ హెగ్డే ట్విట్టర్ లో పెట్టాడు. దీంతో ఆ ట్వీట్ కాస్తా వైరల్ గా మారింది. ఈ సంఘటన మే 18వ తేదీన ఉడిపి మణిపాల్ హైవే పై.. కంజుమెట్టు అనే ప్రాతంలో జరిగినట్టు ఆయన పోస్ట్ చేశారు. ఇలాంటి గ్యాంగ్ వార్స్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Also Read: మిథాలీ రాజ్‌‌తో పెళ్లి.. శిఖర్‌ ధావన్‌ ఏమన్నారంటే!

పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఫైట్ లో పాల్గొన్న ఆరుగురిని గుర్తించిన పోలీసులు వారిలో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారని వెల్లడించారు. పరారీలో ఉన్న ఆ నలుగురి కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

#karnataka #udupi #gang-war
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe