AP News: తిరుపతి జిల్లాలో అనేక చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా సభ్యుల ఆటను పోలీసులు ఆటకట్టించారు. ఐదుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.50 లక్షల చోరీ సోత్తును స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి తెలిపారు.ఈ ఐదుగురు నిందితులు మొత్తం 28 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని ఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి 363 గ్రాముల బంగారు,100 గ్రాముల వెండి,రూ. 1 లక్ష 90 వేల నగదు,15 మోటార్ సైకిళ్ళు, ఎలక్ట్రిక్ పరికరాలు, బోరు మోటార్, ఐరన్ కట్టర్, గ్రైండర్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. జిల్లాలో అక్రమంగా టపాసుల తయారీ, సరఫరా, విక్రయాలు చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
దీపావళి దుకాణాలపై పోలీసుల హెచ్చరిక
దీపావళి పండుగ నేపథ్యంలో నిబంధనలను అతిక్రమించి టపాసులు విక్రయించిన, నిల్వ ఉంచరాదని తెలిపారు. లైసెన్స్ కల్గిన వారు మాత్రమే ప్రభుత్వ నియమనిబంధనలకు లోబడి బాణాసంచా తయారీ లేదా విక్రయాలు చేయాలని ఎస్పీ సూచించారు. బాణాసంచా వంటి పేలుడు పదార్థాలు ఇంట్లో నిల్వ ఉంచరాదని ప్రజలకు పరమేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బహిరంగ ప్రదేశాల్లో నిర్ణీత ప్రమాణాల మేరకు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసుకుని విక్రయించుకోవాలని చెప్పారు. షాపుల వద్ద నీరు, ఇసుక, అగ్నిమాపక సామగ్రిని తప్పనిసరిగా సిద్ధంగా ఉంచుకోవాలని ఎస్పీ తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవుని పోలీసులు హెచ్చరించారు.
అత్యాధునిక పరికరాలతో హర్యానా దొంగలు
గత నెల 14న ధనలక్ష్మినగర్‌లోని ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనానికి సంచలనం సృష్టించిన హర్యానా దొంగల ముఠా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆరుగురు హర్యానా మేవాత్ గ్యాంగ్ నేరగాళ్ళ తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి అరెస్ట్ చేశారు. అత్యాధునిక పరికరాలతో హర్యానా దొంగల ముఠా దొంగతనాలకు పాల్పడేవారు ఎస్పీ తెలిపారు. నిందితుల కోసం రెండు బృందాలుగా ఏర్పడి ఢిల్లీ, హర్యానా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో జల్లెడ పట్టి మేవాత్ గ్యాంగ్‌పై పట్టుకుని వారిపై నాలుగు రాష్ట్రాల్లో 19 కేసులున్నాయి తెలిపారు. నిందితుల నుంచి 21కేజీల గంజాయి, 2 నాటుతుపాకులు, 2 లారీలు, కారు, ఆక్సిజన్ సిలిండర్, గ్యాస్ గన్‌లను స్వాధీనం పోలీసులు చేసుకున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న తిరుపతి రూరల్ పోలీసులకు రివార్డులు ఎస్పీ అందజేశారు.
ఇది కూడా చదవండి: అల్పాహారం మానేస్తున్నారా..? జరిగే పరిణామాలు ఇవే.!!