వినాయకున్ని నిమజ్జనం చేయకపోతే..ఏం అవుతుందో తెలుసా! కొంతమంది ఇళ్లలో వినాయక ప్రతిమకు ఉద్వాసన అయితే చెబుతారు కానీ, నిమజ్జనం చేయరు.అయితే అలా చేయడం వల్ల ఏదో జరుగుతుందన్న భయం అక్కర్లేదు. కానీ.. By Bhavana 28 Sep 2023 in ట్రెండింగ్ వైరల్ New Update షేర్ చేయండి భాద్రపద మాసం శుద్ద చవితి నాడు ఎంతో ఘనంగా ఊరు వాడ చిన్నా పెద్ద అందరూ కలిసి వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ పండుగ పరమార్ధమే ప్రకతిలో మమైకం అవ్వడం. వినాయకుడికి పచ్చని పత్రి పెట్టడం, పండ్లు ఫలహారాలు సమర్పించడం అన్ని కూడా ప్రకృతి ఒడిలో సేద తీరినట్లే. స్వామి వారికి సమర్పించిన పత్రితో సహా నిమజ్జనం చేస్తాం. వినాయకుడిని మట్టితో తయారు చేసి గంగమ్మ ఒడికి సాగనంపుతాం. వినాయకున్ని తొమ్మిది రోజుల పాటు ఇంట్లోనూ, పందిళ్లలోనూ ఉంచడం వల్ల స్వామి వారికి సమర్పించిన పత్రిలోని ఔషద గుణాలు అన్ని కూడా ఆ చుట్టు పక్కల చేరి అక్కడికి వచ్చే వారికి మేలు చేస్తాయి. దీంతో ఊరిలో ఉన్న అనారోగ్య సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. వైరస్, బ్యాక్టీరియా ఇబ్బందలు పోతాయి. ఇలా తొమ్మిది రోజులు పాటు నిర్వహించడం అంటే ఒక కోర్సు లాంటిది. 21 రకాల పత్రి, మట్టి విగ్రహాన్ని నీటిలో కలపడం వల్ల వాటిలో ఉన్న ఔషద గుణాలన్ని కూడా నీటిలోకి చేరతాయి. దీని వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశించడమే కాదు ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. వినాయకుడిని నిమజ్జనం చేయకపోతే వినాయక చవితి అయిన రోజు నుంచి కూడా స్వామి వారిని ఎవరి వీలుని బట్టి వారు పూజలు నిర్వహించి గంగమ్మ ఒడికి చేరుస్తారు. అయితే మండపాల్లో విగ్రహాలను కచ్చితంగా నదులు,జలాశయాలు,చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. కానీ కొంతమంది ఇళ్లలో వినాయక ప్రతిమకు ఉద్వాసన అయితే చెబుతారు కానీ, నిమజ్జనం చేయరు. అయితే అలా చేయడం వల్ల ఏదో జరుగుతుందన్న భయం అక్కర్లేదు. కానీ.. దేవుని విగ్రహాలు ఇళ్లలో ఉంటే దాని పరిమాణానికి తగినంత నైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి. గణపతి అంటేనే అవతారంలో కానీ, ఆకారంలో కానీ చాలా పెద్దది. దానికి తోడు ఆయన పరివారం కూడా పెద్దదే. అలాంటి స్వామి వారికి చిన్న బెల్లం ముక్క, చెంచాడు పంచదార నివేదించి సంతృప్తి పరచలేరు. అందుకే వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని పండితులు చెబుతారు. గచ్ఛ గచ్ఛ సురశ్రేష్ఠ! స్వస్థాన పరమేశ్వర యత్ర బ్రహ్మాదయో దేవ! తత్ర గచ్ఛ గణాధిపా॥ ‘పరమేశ్వర స్వరూపుడవైన ఓ గణనాయకా ! మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి, మా పూజలు అందుకొని మమ్మల్ని అనుగ్రహించిన ఓ దైవమా! ఏ దేవలోకం నుంచి అయితే వచ్చావో, బ్రహ్మాది దేవతలు ఉండే నీ స్వస్థలమైన ఆ దేవలోకానికి వెళ్లిరమ్మ’ని ప్రార్థిస్తూ గణేశుడిని నిమజ్జనం చేస్తారు. #vinayaka #nimajanam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి