Ganesh Shobha Yatra : గణేశ్‌ శోభాయాత్ర రూట్‌ మ్యాప్‌ ఇదే…

గణేశ్‌ నిమజ్జన వేడుకలకు హైదరాబాద్‌ నగరం సర్వంగా సుందరంగా రెడీ అయ్యింది.గ‌ణేశ్ విగ్ర‌హాల‌ను మంగ‌ళ‌వారం హుస్సేన్‌ సాగర్‌ లో నిమ‌జ్జ‌నం చేయ‌నున్నారు. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగ‌ర్ వ‌ర‌కు ప్ర‌ధాన శోభాయాత్ర జరగనుంది.

author-image
By Bhavana
New Update
sobhayatra

Hyderabad : గణేశ్‌ నిమజ్జన (Ganesh Immersion) వేడుకలకు హైదరాబాద్‌ నగరం సర్వంగా సుందరంగా రెడీ అయ్యింది. ఇప్పటికే నగరంలోని 30 శాతం విగ్రహాలను నిమ‌జ్జ‌నం చేయ‌గా, మిగ‌తా గ‌ణేశ్ విగ్ర‌హాల‌ను మంగ‌ళ‌వారం హుస్సేన్‌ సాగర్‌ లో నిమ‌జ్జ‌నం చేయ‌నున్నారు. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగ‌ర్ వ‌ర‌కు ప్ర‌ధాన శోభాయాత్ర జరగనుంది. ప్ర‌ధాన శోభాయాత్ర జ‌రిగే మార్గాల్లో పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Also Read :  గంగమ్మ ఒడిలోకి ఖైరతాబాద్ గణనాయకుడు..ఉదయం 6గంటలకే శోభాయాత్ర ప్రారంభం..!!

బాలాపూర్‌ నుంచి వచ్చే శోభాయాత్ర 

చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, నాగుల చింత, చార్మినార్‌, అఫ్జల్‌గంజ్‌, ఎంజేమార్కెట్‌, అబిడ్స్‌, బషీర్‌బాగ్‌, లిబర్టీ, అంబేద్కర్‌ విగ్రహాం, ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్డు వరకు కొనసాగిన తరువాత ప్రధాన శోభాయాత్రలో కలుస్తుంది.

శోభాయాత్ర జ‌రిగే మార్గాల్లో ఇత‌ర వాహ‌నాల‌కు అనుమ‌తి ఉండ‌ద‌ని పోలీసులు రెండురోజుల క్రితమే తెలిపారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. సికింద్రాబాద్‌ వైపు వచ్చే యాత్ర ఆర్పీరోడ్డు, ఎంజేరోడ్డు, కర్బాలమైదాన్‌, కవాడిగూడ, ముషీరాబాద్‌ క్రాస్‌ రోడ్డు, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, నారాయణగూడ క్రాస్‌రోడ్డు, హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ నుంచి ప్రధాన యాత్రలో కలవనున్నాయి. చిలకలగూడ వైపు నుంచి వచ్చే యాత్ర గాంధీ ఆసుపత్రి వద్ద నుంచి ఆర్టీసి క్రాస్ రోడ్స్, నారాయణగూడ ఫ్లై ఓవ‌ర్, నారాయణగూడ వై జంక్షన్‌, హిమాయత్‌నగర్‌ నుంచి లిబర్టీ వద్ద ప్రధాన ర్యాలీలో కలవాలి.

Also Read :  గణనాథుడి నిమజ్జనానికి సర్వం సిద్ధం.. హుస్సేన్ సాగర్‌లో ఏర్పాట్లు ఇవే..

ఉప్పల్‌ వైపు నుంచి వ‌చ్చే గణపయ్యలను శ్రీరమణ జంక్షన్‌, 6 నెం. జంక్షన్‌, తిలక్‌నగర్‌, శివమ్‌ రోడ్డు, ఎన్‌సీసీ, విద్యానగర్‌ టీ జంక్షన్‌, హిందీ మహావిద్యాలయ, ఫీవర్‌ ఆసుపత్రి, బర్కత్‌పురా, వైఎంసీఏ, నారాయణగూడ ఎక్స్‌ రోడ్స్ వ‌ద్ద‌.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వైపు నుంచి వచ్చే ర్యాలీతో పాటు కలవాలి. అలాగే దిల్‌సుఖ్‌నగర్‌, ఐఎస్‌ సదన్‌, సైదాబాద్‌ వైపు నుంచి నల్గొండ క్రాస్‌రోడు వైపు నుంచి వచ్చే వినాయ‌క విగ్ర‌హాలు.. మూసారాంబాగ్‌, అంబర్‌పేట్‌ మీదుగా హిమాయత్‌నగర్‌ వైపునకు వెళ్లి ప్రధాన ర్యాలీలో క‌ల‌వాలి. అలాగే తార్నాక నుంచి వచ్చే వాహనాలు ఫీవర్‌ ఆసుపత్రి వద్ద నుంచి ప్రధాన ర్యాలీతో పాటు కలవాలి.

టోలిచౌకీ, మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు మాసబ్‌ట్యాంక్‌, నిరాంకారీ, ఓల్డ్‌ సైఫాబాద్‌, ఇక్బాల్‌ మినార్‌ నుంచి ఎన్టీర్‌ మార్గ్‌కు చేరుకోవాలి. ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్‌, పంజాగుట్ట, ఖైరాతాబాద్‌ వైపు నుంచి నిరాంకారి వద్ద గణేషుని యాత్రలో కలవాలి. ఆసీఫ్‌నగర్‌ సీతారాంబాగ్‌, అఘాపురా, గోషమహాల్‌, అలాస్క, మాలకుంట జంక్షన్‌ నుంచి వచ్చే యాత్ర ఎంజే మార్కెట్‌ వద్ద ప్రధాన యాత్రలో కలవాలి.

Also Read : ఏపీలో గణేష్ నిమజ్జనంలో అపశృతి..
Advertisment
తాజా కథనాలు