Ganesh Chaturthi: వరసిద్ధి వినాయకుడి సన్నిధిలో బ్రహ్మోత్సవ వేడుకలు.. సర్వాంగసుందరంగా ఆలయం ముస్తాబు..

చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు వరసిద్ధి వినాయకుడి సన్నిధిలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవ వేడుకలు జరుగుతున్నారు. నేటి నుంచి 21 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

Kanipakam : హమ్మా.. దేవుని బంగారమే కొట్టేద్దామనుకున్నావా..?
New Update

Kanipakam Brahmotsavam 2023: చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు వరసిద్ధి వినాయకుడి(Kanipakam)సన్నిధిలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవ వేడుకలు జరుగుతున్నారు. నేటి నుంచి 21 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. వినాయక చవితిని(Vinayaka Chaviti) పురస్కరించుకుని దేవాదాయ శాఖ అధికారులు ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం నుంచి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక నేటి నుంచి 21 రోజులపాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కాణిపాకం ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. భక్తుల సౌకర్యాలతో, వారి భద్రత కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి.. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

సత్య ప్రమాణాల సన్నిధిగా పేరుగాంచిన కాణిపాకం గణపయ్య సన్నిధిలో వినాయక చవితి వేడుకలు కోలాహలంగా మొదలయ్యాయి. ఈ నెల 18వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇవాళ సాయంత్రం పుష్పకావిడి సమర్పిస్తారు. 19న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. అదే రోజు అంటే మంగళవారం నాడు హంసం వాహనంపై గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఇక ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించకుని దేవాలయాన్ని విద్యుత్ కాంతులతో, పూల మాలలో అద్భుతంగా అలంకరించారు అధికారులు. ఇక వినాయక చవితి సందర్భంగా అర్థరాత్రి 12 గంటల నుంచే పూజలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 3.30 గంటల నుంచి భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తున్నారు అధికారులు. మరోవైపు గణపయ్య దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగి ఈ స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకుంటే విఘ్నాలు తొలగిపోయి.. శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే.. గణనాథుడిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు విచ్చేస్తున్నారు.

ఆర్జిత సేవలు రద్దు..

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కాణిపాకం దేవస్థానం ఆర్జిత సేవలను రద్దు చేసింది. వీఐపీల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఇక చంటి బిడ్డల తల్లులకు, వికలాంగులు, వృద్ధులకు స్వామివారి దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. వినాయక చవితి పర్వదినాన.. స్వామివారు చందనం అలంకరణతో దర్శనం ఇవ్వనున్నారు. బ్రహోత్సవాల నేపథ్యంలో పలువురు భక్తులు గణేషుడి మాల ధరించి భక్తులు తమ మొక్కులను తీర్చుకుంటున్నారు.

Also Read:

Parliament Special Session: నేటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఏ అంశాలపై చర్చించనున్నారంటే..

Minister Harish Rao: అవన్నీ వారంటీ లేని గ్యారెంటీలు.. కాంగ్రెస్‌పై హరీష్ ఫైర్

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe