Ganesh Chaturthi 2024: అందరు ఎంతగానో ఎదురుచూసే గణపతి పండుగ వచ్చేసింది. భారత దేశంలో గణేష్ ఉత్సవ వేడుకలు అంగరంగా వైభంగా జరుపుకుంటారు. పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న చిన్న వీధుల వరకు ప్రతీ చోట గణనాథుడి విగ్రహాలు కొలువుదీరుతాయి. ఇక బొజ్జ గణపయ్య కొలువుదీరిన వేళ నుంచి నిమ్మజ్జనం వరకు మండపాల్లో గణనాథుని పాటలు, భక్తి కీర్తనలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. భక్తి కీర్తనలతో పాటు వినాయక చవితి సమయంలో మండపాల్లో ఈ తెలుగు సినిమా పాటలు తప్పకుండా వినిపిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము
''దండాలయ్యా ఉండ్రాలయ్య''
వినాయక చవితి సమయంలో ప్రతి ఒక్కరి నోట వినిపించే పాట ''దండాలయ్యా ఉండ్రాలయ్య దయుంచయ్య దేవ''... విక్టరీ వెంకటేష్ కూలీ నెం.1 సినిమాలోని ఈ పాటను లెజండ్రీ సింగర్ బాల సుబ్రహ్మణ్యం ఆలపించారు. చక్కటి సాహిత్యంతో కూడిన ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
గల్లీ కా గణేష్
గల్లీ కా గణేష్.. గణపతి బొప్పా మోరియా ఈ పాట వినిపించిన వినాయకుడి మండపం ఉండదు. చతుర్థి మొదలుకొని నిమజ్జనం వరకు ఈ పాట మారుమోగుతూనే ఉంటుంది. ఈ ప్రైవేట్ ఆల్బమ్ ను రాహుల్ సిప్లిగంజ్ పాడాడు.
జై జై గణేశా జై కొడతా గణేశా
మెగాస్టార్ చిరంజీవి మూవీ 'జై చిరంజీవి' సినిమాలోని ఈ పాట సూపర్ హిట్ అయ్యింది. జై జై గణేశా జై కొడతా గణేశా .. జయములివ్వు బొజ్జ గణేశా అంటూ సాగే ఈ పాటను బాలసుబ్రమణ్యం ఆలపించారు.
వక్రతుండ మహాకాయ
వక్రతుండ మహాకాయ.. దేవుళ్ళు సినిమాలోని ఈ పాటను లెజండ్రీ సింగర్ ఎస్. పీ. బీ బాలసుబ్రమణ్యం పాడారు.
గణేష్ ఆంథమ్
భగవంత్ కేసరి సినిమాలో గణపతిని ఆరాధిస్తూ పాడే ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సాంగ్ లో బాలయ్య స్టెప్పులు, మ్యూజిక్ సూపర్ హిట్ గా నిలిచాయి.