విరాట్ స్థానాన్ని గంభీర్ భర్తీ చేస్తాడు..స్టెయిన్! భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ స్థానాన్ని గౌతమ్ గంభీర్ భర్తీ చేయనున్నాడని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డేల్ స్టెయిన్ అన్నాడు.త్వరలో కోచ్ బాధ్యతలు చేపట్టనున్న గంభీర్ కు స్టెయిన్ అభినందలు తెలిపాడు.ఇక నుంచి మైదానంలో విరాట్ దూకుడు తనాన్ని గంభీర్ చూపిస్తాడని ఆయన పేర్కొన్నాడు. By Durga Rao 12 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ స్థానాన్ని గౌతమ్ గంభీర్ భర్తీ చేయబోతున్నాడని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డేల్ స్టెయిన్ అన్నాడు.త్వరలో కోచ్ బాధ్యతలు చేపట్టనున్న గంభీర్ తన దూకుడు స్వభావాన్ని భారత ఆటగాళ్లలో చూస్తామని ఆయన చెప్పారు.కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు అది చూశానని మళ్లీ ఇప్పుడు గంభీర్ ద్వారా చూస్తామని స్టెయిన్ అన్నారు. నేను గౌతమ్ గంభీర్‌కి పెద్ద అభిమానిని. అతని దూకుడు నాకు చాలా ఇష్టం. "మేము వివిధ లీగ్‌లలో జట్ల సరసన ఆడాము, అతనికి మంచి క్రికెట్ పరిజ్ఞానం ఉంది.క్రికెట్ గురించి బాగా ఆలోచించగలడు. దాని ఆధారంగా అతను భారత జట్టు కోచ్‌గా రాణిస్తాడని నేను భావిస్తున్నాను" అని అతను చెప్పాడు.విరాట్ కోహ్లీ భారత జట్టుకు కెప్టెన్ అయిన తర్వాత, అతని దూకుడు స్వభావం భారత జట్టులోని యువ ఆటగాళ్లకు గొప్ప ప్రేరణనిచ్చిందని ఆ సమయంలో భారత జట్టు టెస్ట్ సిరీస్‌లలో ఎక్కువ విజయాలు సాధించిందని స్టెయిన్ అన్నారు. విరాట్ కోహ్లీ భారత జట్టు మేనేజ్‌మెంట్ నుండి తప్పుకోవడంతో, గౌతమ్ గంభీర్ ఇప్పుడు తన దూకుడు స్వభావాన్ని యువ ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తాడని డేల్ స్టెయిన్ చెప్పాడు. "విరాట్ కోహ్లీ వంటి అనుభవజ్ఞులు ఇకపై ఎక్కువ మ్యాచ్‌లు ఆడతారని నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ భారత్ లోనే కాకుండా ప్రపంచ క్రికెట్‌లో కూడా అలాంటి దూకుడు వ్యక్తులు మనకు అవసరం" అని స్టెయిన్ పేర్కొన్నారు. #virat-kohli #gambhir #dale-steyn మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి