YCP : రాజీనామాలపై అలర్ట్ అయిన వైసీపీ..దేవన్ రెడ్డి వెనక్కి తగ్గినట్టేనా? గాజువాక వైసీపీ ఇన్‌ఛార్జ్ దేవన్ రెడ్డి రాజీనామాపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే నాగిరెడ్డి సమక్షంలో వైవీ సుబ్బారెడ్డి దేవన్ రెడ్డితో భేటి అయ్యారు. గాజువాక ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించిన దేవన్‌రెడ్డి పార్టీ నుంచి బలమైన హామీ ఇవ్వడంతో ఆయన శాంతించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. By Jyoshna Sappogula 12 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Gajuwaka YCP Devan Reddy : అధికార పార్టీ వైసీపీ(YCP) లో వరుసగా రాజీనామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నిన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే విశాఖ జిల్లా గాజువాక వైసీపీ కోఆర్డినేటర్ దేవన్ రెడ్డి(Devan Reddy) కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఒకేరోజు ఇద్దరు కీలక నేతలు పార్టీని వీడటం, రాజీనామాలు చేయడం సంచలనంగా మారింది. గాజువాకలో పవన్ కల్యాణ్ ని ఓడించి వైసీపీ తరపున బలంగా నిలబడ్డారు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. ఈసారి ఆయన ఆ స్థానాన్ని కొడుకు దేవన్ రెడ్డికి ఇవ్వాలనుకున్నారు. గాజువాకలో నాగిరెడ్డి తనయుడు దేవన్ రెడ్డి పార్టీ కోఆర్డినేటర్ గా ఉన్నారు. పార్టీ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు. అయితే, అధిష్టానం ఈసారి టిక్కెట్ బీసీకి ఇస్తారన్న సమాచారంతో ఇన్‌ఛార్జ్ పదవికి దేవన్ రెడ్డి రాజీనామా చేయడం పార్టీని వీడటం సంచలనంగా మారింది. అయితే, వరుసగా రాజీనామాలపై అధికార పార్టీ వైసీపీ అలర్ట్ అయింది. గాజువాక వైసీపీ ఇన్‌ఛార్జ్ దేవన్ రెడ్డితో ఎమ్మెల్యే నాగిరెడ్డి సమక్షంలో భేటీ అయ్యారు వైసీపీ ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి. రాజీనామా వార్తలపై చర్చించారు. గాజువాక ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించిన దేవన్‌రెడ్డి వైవీతో భేటీ తర్వాత తన రాజీనామపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. పార్టీ నుంచి దేవాన్ రెడ్డికి బలమైన హామీ ఇచ్చారని అందుకే వెనక్కి తగ్గారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గాజువాకలో వైవీ సుబ్బారెడ్డి చక్రం తిప్పడంతో వైసీపీలో దేవన్‌రెడ్డితోపాటు రాజీనామాలకు సిద్దమైన వారికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. Also Read: గాజువాక, మంగళగిరిలో బీసీ ఇన్‌ఛార్జ్ లను నియమించిన వైసీపీ ఇదిలా ఉండగా, వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం అయ్యేందుకు అధికారిక వైసీపీ ఇప్పటి నుంచి కార్యాచరణ ప్రారంభించింది. వివిధ నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు, వివిధ సర్వేల ఆధారంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ చార్జీలను మార్చేసింది. కొత్తగా 11 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్ చార్జీలను నియమించింది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారాలను కొత్త ఇన్ చార్జీలు పర్యవేక్షిస్తారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం మీడియాకు తెలిపారు. గాజువాక స్థానంలో వరికూటి రామచంద్రరావు ఇన్ చార్జీలుగా వ్యవహరిస్తారని బొత్స సత్యనారాయణ ప్రకటించారు. #andhra-pradesh #ycp #resignation #devan-reddy #gajuwaka-ycp-devan-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి