G20 Summit in New Delhi: జీ20 సమ్మిట్ కోసం సిద్ధమైన ఢిల్లీ.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసా..

జి20 సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ సదస్సు కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు.. అతిథులకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చేందుకు అద్భుతమైన ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.

G20 Summit in New Delhi: జీ20 సమ్మిట్ కోసం సిద్ధమైన ఢిల్లీ.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసా..
New Update

G20 Summit in New Delhi: జి20 సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ(Delhi) వేదికగా జరుగుతున్న ఈ సదస్సు కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు.. అతిథులకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చేందుకు అద్భుతమైన ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. జి20(G2 Summit) గ్రూప్‌లో భాగస్వామ్యమైన దేశాల అధిపతులు భారత్‌(INDIA)లో అడుగు పెట్టబోతున్నారు. వీరితో పాటు, యూఎన్, ఐఎంఎఫ్, వరల్‌డ్ బ్యాంక్, డబ్ల్యూటీవో వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిథులు కూడా ఈ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకుంటున్నారు. సెప్టెంబర్ 09, 10 తేదీల్లో G20 సమావేశం ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరుగనుంది. ఈ సదస్సు సందర్భంగా ప్రతినిథులు ముందుగా రాజ్‌ఘాట్, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్(NGMA), ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(IARI) లను G20 ప్రతినిథులు సందర్శిస్తారు.

ఢిల్లీలో ఆక్షంలు..

జీ20 సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్‌కు సంబంధించి పలు ఆంక్షలు విధించనున్నారు. అత్యవసర సేవలన్నీ కొనసాగుతాయని, ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రం తప్పక ఆంక్షలు ఉంటాయని ఢిల్లీ పోలీస్ అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఢిల్లీలో ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని అంటున్నారు. నేషనల్ హైవే 48 మినహా న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయంటున్నారు. ఇప్పటికే నగరం వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు భద్రతా సిబ్బంది. అణువణువు క్షుణ్ణంగా గాలిస్తున్నారు. ఏ వాహనాన్ని విడవకుండా చెక్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి లాక్‌డౌన్‌ను తలపిస్తున్నాయి. ఆంక్షలు విధించిన ప్రాంతంలో వెళ్లే వాహనానికి గానీ, వ్యక్తులకు అనుమతి పత్రాలు తప్పనిసరిగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.

సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్‌లో మినహా అన్ని స్టేషన్లలో మెట్రో సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా నడుస్తాయని భద్రతా సిబ్బంది తెలిపారు. సుప్రీం కోర్టుల స్టేషన్‌ పరిధిలో మాత్రం సెప్టెంబర్ 9 ఉదయం 5 గంటల నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11 గంటల మెట్రో సేర్వీస్ నిలిపివేయడం జరుగుతుందని భద్రతా సిబ్బంది చెబుతున్నారు. అంతర్రాష్ట్ర బస్ సర్వీస్‌లను కూడా ఢిల్లీలోకి ప్రవేశానికి అనుమతిస్తారు. అయితే, వాటికి రింగ్ రోడ్‌లో టెర్మినేటింగ్ పాయింట్లు ఏర్పాట్లు చేశారు. సిటీ బస్సులు సైతం రింగ్ రోడ్, ఢిల్లీ సరిహద్దుల వైపు నడుస్తాయి. అయితే, న్యూఢిల్లీ ప్రాంతంలో సిటీ బస్సు సర్వీసు అందుబాటులో ఉండవు.

ఇకపోతే.. సెప్టెంబరు 9 ఉదయం 5 గంటల నుండి సెప్టెంబర్ 10 రాత్రి 12 గంటల వరకు వరకు న్యూ ఢిల్లీ పరిధిలో టాక్సీలు, ఆటో-రిక్షాలకు అనుమతి లేదు. అయితే, అనుమతి తీసుకున్న, ధృవీకరణ పత్రాలు కలిగిన పర్యాటకులు వాహనాలు బుక్ చేసుకోవడానికి, ఆ వాహనాలు న్యూఢిల్లీ పరిధిలో నడపటానికి అనుమతి ఉంది.

ప్రగతి మైదాన్ దగ్గర పార్కింగ్ పరిస్థితి..

G20 సదస్సు సందర్భంగా భద్రతా కారణాల దృష్టిలో ఉంచుకుని ప్రగతి మైదాన్ సమీపంలోని అధికారిక వాహనాలకు మాత్రమే పార్కింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్ వాహనాల పార్కింగ్‌కు అనుమతి లేదు. ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను చూసుకోవాలని ప్రయాణికులకు ఇప్పటికే సూచనలు చేశారు ఢిల్లీ పోలీసులు. ఈ ఆంక్షలు సెప్టెంబర్ 7 నుండి 10 వరకు అమలులో ఉంటాయి. అయితే, సమ్మిట్ షెడ్యూల్, భద్రతా అవసరాలు, ఇతర అంశాల ఆధారంగా ట్రాఫిక్ నిబంధనల వ్యవధి మారవచ్చునని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe