Telangana BJP: కిషన్ రెడ్డికి బిగ్ ఝలక్ ఇచ్చిన ప్రధాన అనుచరుడు.. ఆ వెంటనే..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చారు సొంత పార్టీ నేత. కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అంబర్‌పేట నుంచే ఈ ఝలక్ ఇచ్చారు. బీజేపీ హైదరాబాద్ సిటీ మాజీ అధ్యక్షుడు వెంకటరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వెంకట్ రెడ్డి ప్రస్తుతం బాగ్ అంబర్‌పేట్ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు.

New Update
Telangana BJP: కిషన్ రెడ్డికి బిగ్ ఝలక్ ఇచ్చిన ప్రధాన అనుచరుడు.. ఆ వెంటనే..

G Kishan Reddy Follower Resign to BJP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి(Kishan Reddy) భారీ షాక్ ఇచ్చారు సొంత పార్టీ నేత. కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అంబర్‌పేట నుంచే ఈ ఝలక్ ఇచ్చారు. బీజేపీ(BJP) హైదరాబాద్(Hyderabad) సిటీ మాజీ అధ్యక్షుడు వెంకటరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వెంకట్ రెడ్డి ప్రస్తుతం బాగ్ అంబర్‌పేట్ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు. అయితే, రానున్న ఎన్నికల్లో అంబర్ పేట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని వెంకట్ రెడ్డి భావించారు. ఇదే విషయాన్ని కిషన్ రెడ్డికి తెలియజేశారు. అయితే, కిషన్ రెడ్డి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఇక లాభం లేదనుకుని పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ పరివార్‌లో 40 సంవత్సరాలుగా పని చేసిన వెంకట్ రెడ్డి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. అంబర్‌పేట్ నియోజకవర్గంలో అన్ని విధాలుగా సహకారం అందించేవారు. ఈ చనువుతోనే ఆయన ఈసారి అంబర్ పేట్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని కిషన్ రెడ్డిని కోరారు. అయితే, ఇప్పటికే కిషన్ రెడ్డి సైతం అంబర్ పేట నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో వెంకట్ రెడ్డి పోటీకి రావడంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక సైలెంట్ అయ్యారట. అయితే, ఈ సైలెన్స్ వెంకట్ రెడ్డికి నచ్చలేదు.. ఏమాత్రం ఆలోచించకుండా పార్టీని వీడాలని డిసైడ్ అయ్యారు. ఆ మేరకు కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు.

మరో ట్విస్ట్..

పార్టీకి రాజీనామా చేస్తూ లేఖను పంపిన వెంకట్‌ రెడ్డి.. అంతలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన బార్యతో కలిసి బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

Also Read:

Andhra Pradesh: చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు.. ఏసీబీ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ..

Telangana: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇంటి స్థలాలు.. మరో పది రోజుల్లో పంపిణీ..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు