Delhi : ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయం(IGI Airport) లో భారీ ప్రమాదం తప్పింది. సాయంత్రం 5గంలకు ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్(Air India Flight) ఏసీ యూనిట్‌లో మంటలు(Fire) చెలరేగడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానంలో 175 మంది ప్రయాణికులుండగా 18 మీటర్లు ఎగిరిన విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ మేరకు ఎయిర్ కండిషనింగ్ యూనిట్‌లో అనుమానాస్పద మంటలు సంభవించాయి. ప్రయాణికులు సురక్షితంగా బెంగళూర్ ప్రయాణించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఎయిర్‌లైన్ అధికారి తెలిపారు. మూడు అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దింపినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం గురించి సాయంత్రం 6.15 గంటలకు IGI విమానాశ్రయం నుండి మాకు కాల్ వచ్చింది. మేము మూడు ఫైర్ ఇంజన్లను అలర్ట్ చేశామని ఫైర్ ఇంజిన్ అధికారులు వెల్లడించారు.
Also Read : ఈరోజు స్టాక్ మార్కెట్ స్పెషల్ ట్రేడింగ్.. ఎందుకంటే..