AP News: సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిత్రపటాలకు ఏపీలోని గూడూరులో ఫుల్ డిమాండ్ పెరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో వీరిద్దరి చిత్ర పటాలను విక్రయిస్తుండడం అందరినీ ఆకర్షిస్తోంది. దేవతా మూర్తుల చిత్రపటాలను విక్రయించే దుకాణాల్లో సీఎం, డిప్యూటీ సీఎంల చిత్రపటాలను అమ్మడం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.
ఆర్డర్లు ఇచ్చి మరీ కొనుగోలు..
ఈ నేపథ్యంలో గూడూరు పట్టణంలోని పలు దుకాణాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలను ప్రత్యేకంగా రూపొందించి ఒక్కో చిత్రపటం రూ.300 నుంచి రూ.1000 రూపాయల వరకూ అమ్మకాలు సాగిస్తున్నారు. టీడీపీ, జనసేన అభిమాన సంఘాల నాయకులు సీఎం, డిప్యూటీ సీఎంల ఫోటోలతో పాటు స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ చిత్రపటాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ ఫొటోకు పుల్ డిమాండ్ ఏర్పడిందని దుకాణదారులు చెబుతున్నారు. ప్రత్యేకంగా పవన్ అభిమానులు ఆర్డర్లు ఇచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారని, ధర ఎక్కువైనా కొనుగోలు చేయడంలో వెనకాడటం లేదని దుకాణదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ దుకాణాల్లో మాత్రం తాము సరసమైన తక్కువ ధరలకే చంద్రబాబు, పవన్ చిత్రపటాలను విక్రయిస్తున్నామని, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని తెలిపారు.
Also Read: జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా