FSSAI: తల్లి పాలను విక్రయిస్తే అంతే.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వార్నింగ్..!

తల్లి పాలను విక్రయించడం చట్ట విరుద్ధమని, ఎవరైనా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) హెచ్చరించింది. అంతేకాదు.. తల్లి పాలను ప్రాసెస్‌ చేసి అమ్మినా, ఉత్పత్తులను తీసుకొచ్చినా చట్ట ప్రకారం నేరమని తెలిపింది.

New Update
FSSAI: తల్లి పాలను విక్రయిస్తే అంతే.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వార్నింగ్..!

FSSAI: పిల్లలకు తల్లి పాలు ఎంత విలువైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తల్లి పాల ద్వారా పిల్లలకు రోగనిరోధక శక్తి లభిస్తుంది. అయితే కొంత మంది తల్లులకు పాలు అందడం లేదని, మరికొంత మంది పిల్లలకు తల్లిపాలు అందడం లేదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పాల బ్యాంకులను ఏర్పాటు చేసి ఉచితంగా తల్లిపాలు అందజేస్తోంది.

చట్ట విరుద్ధం..

అయితే తల్లి పాలను విక్రయించడం చట్ట విరుద్ధమని, ఎవరైనా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) హెచ్చరించింది. అంతేకాదు.. తల్లి పాలను ప్రాసెస్‌ చేసి అమ్మినా, ఉత్పత్తులను తీసుకొచ్చినా చట్ట ప్రకారం నేరమని తెలిపింది.

Also Read: ఏపీలో కిలాడి కోడలు.. ఏకంగా అత్తను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టింది..!

అధిక లాభాల కోసం..

FSS-2006 చట్టం ప్రకారం, తల్లి పాలను అమ్మడం అనుమతించబడదు. ప్రభుత్వమే పాలిచ్చే తల్లుల నుంచి పాలను సేకరించి నిరుపేద పిల్లలకు అందజేస్తుందని FSSAI వెల్లడించింది. ప్రభుత్వం పాల బ్యాంకులను ఏర్పాటు చేసిందని వివరించారు. అయితే కొందరు అధిక లాభాల కోసం ఆన్‌లైన్‌లో తల్లి పాలను విక్రయిస్తున్నారని, ఆన్‌లైన్‌లో ఇలాంటి విక్రయాలు జరుగుతున్నాయని FSSAI ఆందోళన వ్యక్తం చేసింది.

హెచ్చరిక..

ఇలాంటి అనధికార విక్రయాలను వెంటనే నిలిపివేయాలని హెచ్చరించింది. అంతేకాదు తల్లి పాలను విక్రయించేందుకు ప్రయత్నించే వ్యాపారులకు లైసెన్సులు ఇవ్వవద్దని FSSAI కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అంతేకాకుండా.. అధిక లాభాల కోసం ఆన్‌లైన్‌లో తల్లి పాలను విక్రయిస్తున్న ఘటనలు ఈ మధ్య పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisment
తాజా కథనాలు