FSSAI: అవన్నీ తప్పుడు కథనాలు.. పురుగుమందుల అవశేషాల పరిమితులపై FSSAI స్పష్టీకరణ 

పురుగుమందుల అవశేషాలు మూలికలు, సుగంధ ద్రవ్యాలలో ఎక్కువ కనిపించినా అనుమతిస్తున్నట్లు వచ్చిన వార్తలను  FSSAI తోసిపుచ్చింది. అవన్నీ తప్పుడు వార్తలు అని స్పష్టం చేసింది. ఒక మీడియా రిలీజ్ లో వివిధ అంశాలను స్పష్టం చేసింది. ఆ వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 

FSSAI: అవన్నీ తప్పుడు కథనాలు.. పురుగుమందుల అవశేషాల పరిమితులపై FSSAI స్పష్టీకరణ 
New Update

FSSAI: మూలికలు- సుగంధ ద్రవ్యాలలో ఎక్కువ పురుగుమందుల అవశేషాలను అనుమతించినట్లు మీడియా నివేదికలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తోసిపుచ్చింది. ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ ఒక మీడియా రిలీజ్ లో నివేదికలను "తప్పుడు -హానికరం"గా పేర్కొంటూ ప్రకటన చేసింది. భారతదేశం ప్రపంచంలోని గరిష్ఠ అవశేషాల పరిమితుల (MRLs) అత్యంత కఠినమైన ప్రమాణాలలో ఒకటిగా ఉందని చెప్పింది. అలాగే, వివిధ ఆహార వస్తువులకు పురుగుమందుల MRLలు వాటి ప్రమాద అంచనాల ఆధారంగా వేర్వేరుగా నిర్ణయించారని తెలిపింది. 

భారతదేశంలో, క్రిమిసంహారక చట్టం, 1968 కింద ఏర్పాటైన సెంట్రల్ ఇన్‌సెక్టిసైడ్ బోర్డు, రిజిస్ట్రేషన్ కమిటీ (CIB & RC) ద్వారా వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoA - FW) ద్వారా పురుగుమందులు నియంత్రణలో ఉంటాయని ఆ నోట్ లో పేర్కొన్నారు. 

ANI వెల్లడించిన ఈ మీడియా రిలీజ్ ప్రకారం CIB&RC పురుగుమందుల తయారీ, దిగుమతి, రవాణా, నిల్వను నియంత్రిస్తాయి.  అదేవిధంగా, పురుగు మందుల నమోదు జరుగుతుంది. దీని ఆధారంగానే నిధించడం లేదా నిరోధించడం చేస్తారు.  భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (FSSAI) పురుగుమందుల అవశేషాలపై శాస్త్రీయ ప్యానెల్ CIB& RC ద్వారా వచ్చిన డేటాను పరిశీలిస్తుంది.  భారతీయ జనాభా ఆహార వినియోగం, అన్ని వయస్సుల వారికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని ప్రమాద అంచనాను నిర్వహించి MRLలను సిఫార్సు చేస్తుందని FSSAI తెలిపింది.

Also Read: ఉల్లి ఎగుమతులపై నిషేధం తొలగింపు.. ఇప్పుడే ఎందుకు? దేశంలో ధరలు పెరుగుతాయా?

భారతదేశంలో CIB&RC నమోదు చేసిన మొత్తం పురుగుమందులు 295 కంటే ఎక్కువ ఉన్నాయి.  వాటిలో 139 పురుగుమందులు సుగంధ ద్రవ్యాలలో ఉపయోగం కోసం నమోదు అయ్యాయి.  కోడెక్స్ మొత్తం 243 పురుగుమందులను స్వీకరించింది.  వాటిలో 75 పురుగుమందులు సుగంధ ద్రవ్యాలకు వర్తిస్తాయి. రిస్క్ అసెస్‌మెంట్ డేటా ఆధారంగా వివిధ MRLలతో అనేక ఆహార వస్తువులపై పురుగుమందు నమోదు చేయబడుతుంది. ఉదాహరణకు, వరి 0.03 mg/kg, సిట్రస్ పండ్లు 0.2 mg/kg, కాఫీ గింజలు 0.1 mg/kg అలాగే ఏలకులు 0.5 mg/kg, మిరపకాయలు 0.2 mg వంటి వివిధ MRLలు కలిగిన అనేక పంటలపై మోనోక్రోటోఫాస్ వాడకం అనుమతిస్తారు.  MRLలు స్థిరపరచని పురుగుమందుల విషయంలో MRL 0.01 mg/kg వర్తిస్తుంది. ఈ పరిమితి మసాలా దినుసుల విషయంలో మాత్రమే 0.1 mg/kgకి పెంచారు.  CIB & RC ద్వారా భారతదేశంలో నమోదు చేయని పురుగుమందులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

వివిధ MRLలతో 10 కంటే ఎక్కువ పంటలలో ఒక క్రిమిసంహారక/పురుగుమందు ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు, ఫ్లూబెండియామైడ్‌ను బ్రింజల్‌లో 0.1 MRLతో ఉపయోగిస్తారు. అయితే, వంగలో గ్రాముకు MRL 1.0 mg/kg, క్యాబేజీకి 4 mg/kg, టొమాటో కోసం 2 mg/kg, టీకి ఇది 50 mg/kg. అదేవిధంగా, ఆహార ధాన్యాలకు మోనోక్రోటోఫాస్ 0.03 mg/kg, సిట్రస్ పండ్లకు 0.2 mg/kg, ఎండు మిరపకాయలకు 2 mg/kg అలాగే  ఏలకులకు 0.5 mg/kg వరకూ అనుమతిస్తారు. 

"MRLలు డైనమిక్ స్వభావం కలిగి ఉంటాయి.  శాస్త్రీయ డేటా ఆధారంగా క్రమం తప్పకుండా సవరణలు జరుగుతున్నాయి. ఈ విధానం మొత్తం  ప్రపంచ ప్రమాణాలతో సమానంగా జరుగుతుంది. అలాగే, MRL రివ్యూలు శాస్త్రీయంగా చెల్లుబాటు అయ్యే ప్రాతిపదికన, తాజా పరిశోధనలు- అంతర్జాతీయ నిబంధనలను ప్రతిబింబించేలా నిర్ధారిస్తుంది" అని FSSAI తెలిపింది. 

#food-and-safety #fssai
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి