Etala:ఈటల రూట్ ఎటు? హుజూరాబాద్ ను వదులుకుంటారా?

సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి తానే పోటీకి నిలబడుతానని ఈటల గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు కేసీఆర్ రెండు స్థానాల నుంచి బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఈటల తన సవాల్ ప్రకారంగా గజ్వేల్ నుంచి నిలబడతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. లేదా ఆయన కామారెడ్డి నుంచి సీఎంకు పోటీని ఇస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. లేక ఆయన ఈ సవాల్ నుంచి తప్పుకుంటారా.. అన్న దానిపై ఉత్కంఠ నెలకొన్నది..

New Update
Etala:ఈటల రూట్ ఎటు? హుజూరాబాద్ ను వదులుకుంటారా?

Etala: బీఆర్ఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదలతో తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పదేళ్లుగా గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఈ సారి మాత్రం ఆయన అనూహ్యంగా రెండు స్థానాల నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో ఆయన కామారెడ్డి నియోజక వర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. దీంతో హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్ ఈటల సవాల్ సంగతేంటనేది..?? రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

గజ్వేల్ నుంచి తానే బరిలోకి అన్న ఈటల..!

సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ (Gajwel) నుంచి తానే పోటీకి నిలబడుతానని ఈటల గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు కేసీఆర్ రెండు స్థానాల నుంచి బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఈటల తన సవాల్ ప్రకారంగా గజ్వేల్ నుంచి నిలబడతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. లేదా ఆయన కామారెడ్డి నుంచి సీఎంకు పోటీని ఇస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. లేక ఆయన ఈ సవాల్ నుంచి తప్పుకుంటారా.. అన్న దానిపై ఉత్కంఠ నెలకొన్నది.

హుజురాబాద్ ను ఈటల వదులుకుంటారా..!

ఈటల రాజకీయ ప్రస్తానం మొదలుపెట్టినప్పట్నుంచి.. డీలిమిటేషన్ కు ముందు ఉన్న కమలాపూర్ నియోజకవర్గం అంటే ప్రస్తుతమున్న హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి కేసీఆర్ పై తాను పోటీ చేస్తానని ఆయన ప్రకటించి నేపథ్యంలో గజ్వేల్ లేక కామారెడ్డి నుంచి ఆయన పోటీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టినప్పట్నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న హుజురాబాద్ ను వదులుకుంటారా అన్నది కూడా పెద్ద ప్రశ్నగా మారింది.

ఇక బీఆర్ఎస్ (BRS) నుంచి బయటికొచ్చిన తరువాత ఆ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ఈటల కేసీఆర్ ను పర్సనల్ గా సవాల్ చేశారు.’ బీసీ బిడ్డ’, ‘ఆత్మగౌవరం’ నినాదాలతో ప్రచారానికెళ్లిన ఈటల (Etela Rajender) ను హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలు పట్టం కట్టారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఆ నియోజక వర్గాన్ని వదులుకుంటారా..  ఈ విషయంలో బీజేపీ పార్టీ హైకమాండ్ నిర్ణయం ఎలా ఉండబోతుంది.. కేసీఆర్ పై ఆయన్ని పోటీ చేయడానికి బీజేపీ అధిష్టానం అనుమతిస్తుందా...ఇవన్నీ కాస్త పక్కన పెడితే.. రాజకీయంగా కేసీఆర్ ను నిలువరించే సత్తా ఈటలకు ఉందా.. అనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో ఈటల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.

Also Read: అగ్రకులాలకే కేసీఆర్ పెద్దపీట.. ఎన్ని సీట్లు ఇచ్చారో తెలుసా?

Advertisment
తాజా కథనాలు