/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-06-at-6.58.02-PM-jpeg.webp)
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగాడు నాని. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి నాచురల్ స్టార్‌గా ఎదిగి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకొని, ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.
తాజాగా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్15 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు నాని. నాని హీరోగా పరిచయమైన 'అష్టా చమ్మా' సినిమా 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. తన అద్భుతమైన నటనతో తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులో ముద్రవేసుకున్నాడు నాని. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది.
The laugh riot movie Asta Chamma was released 15yrs back. One of the best for Nani !!#Nani #Tanikella #Astachamma #swati #Telugu #Movie @NameisNani @TanikellaBharni pic.twitter.com/vi6ZYBRo5H
— Aryan (@chinchat09) September 5, 2023
నాని, అవసరాల శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కింది అష్టా చమ్మ. విలేజ్, సిటీ బ్యాక్ డ్రాప్స్ మిక్స్ చేసి తీసిన ఈ సినిమాలో స్వాతి హీరోయిన్‌గా నటించింది. మహేష్.. అని సాగదీస్తూ స్వాతి చెప్పిన డైలాగ్ ఇందులోనిదే. ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. నానిని హీరోగా నిలబెట్టడమే కాదు, అదే సమయంలో స్వాతి, అవసరాల శ్రీనివాస్ కెరీర్స్ ను కూడా సెట్ చేసింది ఈ మూవీ. ఈ మూవీ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా యూనిట్ అంతా గెట్-టుగెదర్ అయ్యారు. తమ అనుభూతుల్ని మరోసారి షేర్ చేసుకున్నారు.
We complete 15 years ♥️ pic.twitter.com/jLhFsNc2sA
— Nani (@NameisNani) September 5, 2023
ఇక నాని విషయానికొస్తే.. అష్టాచమ్మా నుంచి నిన్నటి దసరా వరకు ఓ అద్భుతమైన నటుడిగా పరిణతి చెందాడు. నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు. ఈ 15 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్స్‌తో పాటు జెర్సీ లాంటి క్లాసిక్స్ అందించాడు. ప్రస్తుతం హాయ్ నాన్న అనే మరో ఎమోషనల్ మూవీ చేస్తున్నాడు. డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది.