Chandrayaan-3: గూగుల్‌ నుంచి అమూల్ వరకు.. చంద్రయాన్‌ సక్సెస్‌కి యాడ్ ప్రపంచం ఫిదా..!

చంద్రయాన్‌-3 సక్సెస్‌ని యాడ్‌ ప్రపంచం సెలబ్రేట్ చేసుకుంటోంది. గూగుల్‌, అమూల్‌, కోకా కోలా, స్విగ్గీ, టాటా క్లిక్, బ్రూక్‌ఫీల్డ్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు చంద్రయాన్‌-3పై స్పెషల్‌ యాడ్స్‌ క్రియేట్ చేశాయి. వీటిలో మల్డినేషనల్‌ యాడ్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. అటు సౌరశక్తి సాయంతో జాబిల్లిపై వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం లాంటి అంశాలను ల్యాండర్‌ అధ్యయనం చేస్తోంది. అక్కడి ఫొటోలు, పరిస్థితులను ఎప్పటికప్పుడు అందిస్తోంది.

Chandrayaan-3: గూగుల్‌ నుంచి అమూల్ వరకు.. చంద్రయాన్‌ సక్సెస్‌కి యాడ్ ప్రపంచం ఫిదా..!
New Update

How ad World reacts to Chandrayaan-3: జాబిల్లి దక్షిణ ధృవంపై చంద్రయాన్‌-3 కాలు మోపిన తర్వాత ప్రపంచం మొత్తం ఇస్రోకు జేజేలు కొడుతోంది. ఇప్పటివరకు ఏ దేశం కూడా చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టలేదు. అంతర్జాతీయ మీడియా సంస్థల నుంచి యాడ్‌ వరల్డ్‌ వరకు ప్రతి ఒక్కరూ ఇస్రోను కీర్తిస్తున్నారు. తమదైన శైలిలో విషెస్‌ చెబుతున్నారు. యూనిక్‌ స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

యాడ్‌ వరల్డ్‌ ఎలా రియాక్ట్ అయ్యిందంటే?


మెక్‌డొనాల్డ్స్

Shaadi.com:

publive-image అమూల్


హ్యాపీడెంట్:


ఉబెర్ :


టాటా క్లిక్

BoAt:


బుక్ మై షో:

స్విగ్గీ:


కోకా కోలా:

ఎల్లుండు బెంగళూరుకు మోదీ:

ఇదిలా ఉంటే ..ఈ 26న బెంగళూరుకు రానున్నారు ప్రధాని మోదీ. చంద్రయాన్‌-3 సక్సెస్‌తో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు..ఎల్లుండి బెంగళూరు రానున్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధాని..ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత ఈ 26న రాత్రి 7 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలతో భేటీ అవనున్నట్టు తెలుస్తోంది. దాదాపు రెండు గంటలపాటు వారితో గడపనున్నారు. నిన్న చంద్రయాన్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ను సౌతాఫ్రికా నుంచి వీక్షించిన ప్రధాని..ఇస్రో బృందాన్ని అభినందించారు. జాతినుద్దేశించి ప్రసంగించారు.ఇస్రో చేపట్టిన ప్రయోగానికి పరిపూర్ణ విజయాన్ని చేకూరుస్తూ రోవర్‌ ప్రజ్ఞాన్‌..చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా అడుగుపెట్టింది. చంద్రుని గుట్టు విప్పడంలో కీలక పాత్ర పోషించే రోవర్‌..తన పని మొదలుపెట్టేసింది. 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది. సౌరశక్తి సాయంతో జాబిల్లిపై వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం వంటి అంశాలను అధ్యయనం చేస్తాయి. అక్కడి ఫొటోలు, పరిస్థితులను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయి. ఇక చంద్రుడిపై కాలుమోపిన విక్రమ్‌, ప్రజ్ఞాన్‌ సూర్యరశ్మితో పనిచేస్తాయి. చంద్రుడిపై పగలు..14 రోజుల పాటు ఉంటుంది. ఆ తర్వాత చంద్రుడిపై చీకటి నెలకొని ఉష్ణోగ్రత మైనస్‌ 180 డిగ్రీలకు పడిపోతుంది. ఆ సమయంలో ల్యాండర్‌, రోవర్‌ మనుగడ కష్టం. ఐతే ఆ 14 రోజుల తర్వాత చంద్రుడిపై సూర్యోదయం అయ్యాక..విక్రమ్‌, ప్రజ్ఞాన్‌పై సూర్యరశ్మి పడి తిరిగి పనిచేయడం మొదలుపెడితే గొప్ప ప్రయోజనమని ఇస్రో చెబుతోంది. అయితే ప్రగ్యాన్ రోవర్ కేవలం 26 కిలోలు ఉండటంతో అది విక్రమ్ ల్యాండర్‌తో మాత్రమే కమ్యూనికేషన్ కలిగి ఉంటుంది. చంద్రుడిపై తిరుగుతూ రోవర్ సేకరించిన సమాచారాన్ని ల్యాండర్‌కు అందిస్తే..అది అక్కడి నుంచి భూమిపైన బెంగళూరులో ఉన్న ఇస్రో కేంద్రానికి డేటాను ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ల్యాండర్‌ విక్రమ్‌ యాక్టివేట్‌ అయితేనే భూమికి సంకేతాలు చేరతాయి.

#chandrayaan-3 #google-doodle #amul
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe