Cafe : ఓ కేఫ్ లో భోజనం చేసిన తరువాత మౌత్ ఫ్రెషనర్(Mouth Freshener) తిన్న ఐదుగురు కస్టమర్లు రక్తపు వాంతులు(Blood Vomiting's) చేసుకుని ప్రాణపాయ స్థితిలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్(Gurugram) కు చెందిన అంకిత్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, స్నేహితులతో కలిసి లాఫోరెస్టా అనే కేఫ్ కి విందుకు వెళ్లాడు.
అక్కడ విందు అరగించిన తరువాత వారు మౌత్ ఫ్రెషనర్ ని తిన్నారు. ఆ సమయంలో వారు ఒక్కసారిగా నోరంతా మంట, నొప్పి అంటూ పెద్దగా కేకలు వేశారు. దీంతో కేఫ్ సిబ్బంది వారికి ఐస్ క్యూబ్ లను అందించింది. అయినప్పటికీ వారి మంట తగ్గకపోగా..ఒక్కసారిగా రక్తపు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు.
దీంతో అంకిత్ మాట్లాడుతూ..'' మేము మౌత్ ఫ్రెషనర్ తిన్నప్పటి నుంచి కూడా మాకు నోరంతా మంటలు, లోపల దద్దుర్లు లాంటివి వచ్చాయి. కేఫ్(Cafe) సిబ్బంది మౌత్ ఫ్రెషనర్ లో ఏమి కలిపారో మాకు తెలియడం లేదు అంటూ వాపోయాడు. అనంతరం అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని వారు తిన్న మౌత్ ఫ్రెషనర్ ని స్వాధీనం చేసుకున్నారు.
దానిని వైద్య పరీక్షలకు పంపగా అది డ్రై ఐస్(Dry Ice) అని..అది ప్రాణాంతకం కలిగించే యాసిడ్ అని వారు నిర్థారించారు. బాధితులు రక్తపు వాంతులు చేసుకుంటున్నప్పటికీ కూడా కేఫ్ సిబ్బంది వారికి ఎటువంటి సహాయం అందించలేదు. ఐదుగురు బాధితులను ఆసుపత్రికి తరలించగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.
పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు రెస్టారెంట్ యజమాని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read : మహాశివరాత్రి నాడు ఈ వస్తువులను తప్పక దానం చేయండి..మహాదేవుని అనుగ్రహాం పొందండి!