Emmanuel Macron : భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ (Emmanuel Macron)హాజరైన సంగతి తెలిసిందే. గురువారం ఆయన భారత దేశానికి వచ్చారు. రాజస్థాన్ లోని జైపూర్ సిటీని సందర్శించారు. జైపూర్ నగరంలో జంతర్ మంతర్ వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు కాసేపు మాట్లాడుకున్నారు. భారత పర్యటకు విచ్చేసిన మక్రాన్ రెండు రోజుల పాటు దేశంలో పర్యటించారు. తొలిరోజు జైపూర్ లో ఆయన సందర్శించారు.
అయితే ప్రధాని మోదీ, మక్రాన్ ఇద్దరు కలిసి జైపూర్ నగరంలో టీ స్టాల్ వద్ద సాధారణ వ్యక్తుల వలే చాయ్ తాగారు. తర్వాత మక్రాన్ యూపీఐ (UPI)ద్వారా డబ్బులు చెల్లించడం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అయితే ప్రధాని మోదీ యూపీఐ విధానం గురించి మక్రాన్ కు (French President) వివరించడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందుకు మక్రాన్ హాజరయ్యారు. అనంతరం ప్రసంగించారు. టీ అనేద హిందీ పదాన్ని ఉపయోగించి ప్రధాని మోదీతో కలిసి చాయ్ తాగడం మర్చిపోలేనని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి: లాలూ ఫ్యామిలీకి..ఇతరులకు ఢిల్లీ కోర్టు సమన్లు..!!