TS DSC: డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ... అంతేకాకుండా బుక్ ఫండింగ్ కూడా... వెంటనే అప్లై చేసేయండి! తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ఆర్థిక స్థోమత సరిగా లేని వారిని ఎంపిక చేసి ఉచితంగా కోచింగ్ ఇవ్వటమే కాకుండా.. రూ. 1500 బుక్ ఫండ్ ను ఇవ్వనుంది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. By Bhavana 04 Apr 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి TS BC Study Circle Free Coaching For DSC: ఉచితంగా డీఎస్సీ కోచింగ్ శిక్షణ తీసుకోవాలనుకుంటున్నారా..వాటితో పాటు ఉచితంగా పుస్తకాలు కూడా అందుకోవాలనుకుంటున్నారా. అలాంటి వారికి ఓ శుభవార్త చెప్పింది తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ. ఆర్థిక స్థోమత సరిగా లేని వారిని ఎంపిక చేసి ఉచితంగా కోచింగ్ ఇవ్వటమే కాకుండా.. రూ. 1500 బుక్ ఫండ్ ను ఇవ్వనుంది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ ప్రక్రియ మార్చి 13వ తేదీన ప్రారంభం కాగా…ఏప్రిల్ 5వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. https://tsbcstudycircle.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు ను పూర్తి చేయాల్సి ఉంటుందని అదికారులు తెలిపారు. ఈ ఉచిత శిక్షణ కోసం 10వేల మందిని ఎంపిక చేసి జిల్లాల కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. ఇందులో 7000 మంది ఎస్జీటీ అభ్యర్థులకు, 3000 మంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కోచింగ్ ఇస్తామని బీసీ సంక్షేమ శాఖ తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు రూ.1500 ల బుక్ ఫండ్‌తో (DSC Book Fund) పాటు ఉచిత స్టడీ మెటీరియల్ (Free Study Material) కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కోచింగ్ కోసం అప్లై చేసుకునే వారి కుటుంబ వార్షికాదాయం రూ. 5 లక్షలకు మించి ఉండకూడదు. ఈ శిక్షణ తీసుకునే వారు టెట్ లో అర్హత సాధించి ఉండాలి. డీఎస్సీకి అప్లై చేసుకోవాడానికి అర్హులై ఉండాలి. బీఎడ్, టెట్, డైట్ మార్కుల ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. https://tsbcstudycircle.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.దరఖాస్తులకు చివరి తేదీ - ఏప్రిల్ 05, 2024. Also read: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 8 ప్రత్యేక రైళ్ల పొడిగింపు! #telangana #coaching #dsc #free మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి