/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Bhatti-Vikramarka-2.jpg)
Free Power: తెలంగాణలో విద్యాసంస్థలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట అన్ని విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌ను ఇస్తామని ప్రకటించింది. టీచర్స్ డే సందర్భంగా ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి ఇంధనశాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్‌కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ఉన్న మొత్తం అన్ని విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ వెంటనే అమలు చేస్తామని మంత్రి భట్టి తెలిపారు. తెలంగాణలో ఉన్న విద్యా సంస్థల జాబితాను తయారు చేయాలని విద్యాశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.