అనాథ బాలలకు ఉచితంగా ఆదిపురుష్ ప్రదర్శన

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆదిపురుష్. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా దూసుకెళ్తూనే ఉంది. అయితే ఓ వైపు సినిమాపై విమర్శలు వస్తున్నా.. ప్రజల ఆదరణ ఏమాత్రం తగ్గటం లేదు.

New Update
అనాథ బాలలకు ఉచితంగా ఆదిపురుష్ ప్రదర్శన

Free performance of Adipurush for orphans at NarasaRaopet

ఉచితంగా సినిమా ప్రదర్శన

పల్నాడు జిల్లా నరసరావుపేటలో అనాథ బాలలకు ఉచితంగా ఆదిపురుష్ ప్రదర్శన చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అనాథ బాలలతో కలసి ఆదిపురుష్ సినిమా చూశారు జిల్లా కలెక్టర్ శివశంకర్. అనాథ పిల్లలతో సినిమా చూడటం చాలా సంతోషంగా ఉందని కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. థియేటర్‌లో చూడగానే ఆశ్చర్యపోయాను, త్రీడిలో రామాయణం ఆదిపురుష్ చూస్తుంటే పిల్లలు సంతోషం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. 420 మంది పిల్లలకు ఉచితంగా సినిమా ప్రదర్శన ఏర్పాటు చేసిన థియేటర్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.

దూసుకెళ్తున్న అదిపురుష్..

వసూళ్లలో బాక్సాఫీసు వద్ద ఆదిపురుష్ మూడో రోజు కూడా దూసుకెళ్లింది. ఓ వైపు సినిమాపై విమర్శలు వస్తున్నా.. వసూళ్లు మాత్రం తగ్గడం లేదు. మూడో రోజు ఎంత కలెక్షన్స్ సాధించింది. ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైన విషయం తెలిసిందే. ఎన్నో విమర్శలు, వివాదాలను దాటుకొని.. థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకెళ్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు