Supreme Court : ఉచిత హామీ(Free Guarantee) లు తప్పు.. ప్రభుత్వ డబ్బు(Government Money) తో ఓటర్లకు లంచాలివ్వడం అనైతికం అంటూ పుస్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాకలు అయింది. దీని మీద సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్‌ను విచారించాలని డీ.వై. చంద్రచూడ్ త్రిసభ్య ధర్మాసనం నిర్ణయించుకుంది. ఈ పిటిషన్ గురించి మేం మాట్లాడుకున్నాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. దీన్ని రేపు జాబితాలో ప్రస్తావిస్తామని ధర్మాసనం ప్రకటించింది. వచ్చే నెల 19 నుంచి సార్వత్రిక ఎన్నికలు మొదలవనున్నాయి. ఈ నేపథ్యంలో ఉచిత హామీల మీద సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది.
అది లంచం ఇచ్చినట్టే కదా..
రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ... ఓటర్ల(Voters) ను పార్టీలు మభ్యపెడుతున్నాయి. దాని కోసమే ఉచిత హామీలను ప్రకటిస్తున్నాయి. ఇది రాజ్యాంగానికి పూర్తి విరుద్ధం..అందుకే వీటిని వెంటనే నిషేధించాలని అంటూ సుప్రీంకోర్టులో పిటిష్ దాఖలు అయింది. ఉచిత హామీలను నిరోధించేలా ఎన్నికల కమిషన్(Election Commission) ను ఆదేశించాలని అభ్యర్ధించారు న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్. అసంబద్ధ హామీలు ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు అని, రాజ్యాంగ స్ఫూర్తికీ విఘాతమని తెలిపారు. ప్రభుత్వ డబ్బును ప్రజలకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇది లంచం కిందకు రాదా అని అడుగుతునున్నారు. ప్రజాస్వామ్య విలువలను, సంప్రదాయాలను రక్షించాలంటే వీటికి అడ్డుకట్ట వేయాల్సిందే నని పిటిషన్‌లో పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే ఈ పిల్ మీద విచారణ జరిపించాలని కోరారు. దీనికి సుప్రీంకోర్టు(Supreme Court) ధర్మాసనం అంగీకరించింది.
Also Read : Telangana: ప్రణీత్ రావ్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు