తెలంగాణ అన్ని పార్కుల్లోకి ఉచిత ఎంట్రీ

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు హరితోత్సవం. ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు అధికారులు. అన్ని పార్కుల్లో ప్రజలకు ఉచిత ప్రవేశ అనుమతి ఇచ్చి, పార్కులను సందర్శించేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు.

New Update
తెలంగాణ అన్ని పార్కుల్లోకి ఉచిత ఎంట్రీ

Free entry to all parks Green Festival in Telangana

నిజమైన పర్యావరణ వేత్త ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా హరితోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌ వేదిక మంత్రి.. మౌలిక సదుపాయాలతో పాటు పచ్చదనం కలిగి ఉన్న అరుదైన రాష్ట్రం తెలంగాణ అని హరీష్‌రావు అన్నారు. దూరదృష్టితో ప్రారంభించిన హరితహారం ద్వారా సీఎం కేసీఆర్‌ పచ్చదనంలో 7.7 శాతం వృద్ధి నమోదైందని ఆయన తెలిపారు. 14 వేల 864 నర్సరీలు, 19 వేల 472 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామని హరీష్‌రావు వెల్లడించారు. అంతకాకుండా 13.44 లక్షల ఎకరాల్లో అడవులను పెంచామని, కొత్తగా 273 కోట్ల మొక్కలను నాటామని ఆయన అన్నారు. నిజమైన పర్యావరణ వేత్త సీఎం కేసీఆర్‌ అని, సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని హరీష్‌రావు ట్వీట్ చేశారు.

పచ్చదనంతో కలకలలాడుతున్న తెలంగాణ

అటవీ శాతాన్ని పెంచాలన్న ఆలోచనతో సీఎం కేసీఆర్‌ తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు కోట్ల మొక్కలను నాటి సంరక్షించడంతో రాష్ట్రంలో పచ్చదనం అలుముకుంది. దేశంలోనే అతి పెద్దదైన కేసీఆర్‌ ఎకో అర్బన్‌ పార్కును 2087 ఎకరాల్లో మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం సమీపంలో ఏర్పాటు చేశారు. 2021లో రెండుకోట్ల సీడ్‌బాల్స్‌ వెదజల్లి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డును సాధించారు. గ్రామాలు, మండలాలు, బల్దియాల్లోని నర్సరీల ద్వారా ఏటా వానకాలంలో వేలాది మొక్కలు నాటుతున్నారు. రహదారుల వెంట గ్రీనరీ పరుచుకోవడంతో ప్రయాణికులకు ఆహ్లాదకర అనుభూతి కలుగుతున్నది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హరితోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకుగానూ ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లు చేశారు.

#NULL
Advertisment
Advertisment
తాజా కథనాలు