TG Schools: ఆ సర్కారు బడులకు ఉచిత కరెంటు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన!

రాష్ట్రంలోని 30 వేల సర్కారు బడులకు ఉచిత కరెంటును అందిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పించేందుకు 'అమ్మ సెల్ఫ్ హెల్ప్' గ్రూపులను ప్రవేశపెడతామని తెలిపారు. అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యం అన్నారు.

TG Schools: ఆ సర్కారు బడులకు ఉచిత కరెంటు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన!
New Update

CM Revanth: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ తెలిపారు. 30 వేల పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, రాష్ట్ర భవిష్యత్తు టీచర్లపైనే ఆధారపడి ఉందన్నారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన టీచర్ల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్రంలోని 30 వేల సర్కారు బడులకు ఉచిత కరెంటును అందిస్తామని చెప్పారు.

ఎన్రోల్ మెంట్ తగ్గడానికి ఎక్కడో లోపం ఉంది..
30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులున్నారు. 10 వేల ప్రైవేట్ స్కూల్లో 33 లక్షల మంది చదువుతుండ్రు. ప్రైవేటు పాఠశాలల్లో మీకంటే ఎక్కువ చదువుకున్నోళ్లు ఉన్నరా? ఇంటర్ పాసై, డిగ్రీ ఫెయిలైన వారే ఉన్నరు. మన స్కూళ్లలో ఎన్రోల్ మెంట్ తగ్గడానికి ఎక్కడో లోపం ఉంది. అది మాది కూడా కావచ్చు. కారణం ఏదైనా కావచ్చు. ఆడబిడ్డలు, మహిళా టీచర్లు టాయ్ లెట్లు లేక ఇబ్బందులు పడుతుండవచ్చు. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అమ్మ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు అందించబోతున్నాం. మన పాఠశాలలను బాగు చేసుకుందాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించి దేశ భవిష్యత్ ను నిర్మించాలి. ప్రతి నెలా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నాం. ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. ప్రమోషన్లు ఇచ్చాం. 35 వేల మందికి బదిలీలు చేశామని చెప్పారు.

ఇది కూడా చదవండి: TG Teachers: గవర్నమెంట్ బడి అంటే గర్వపడేలా చేయాలి.. టీచర్లకు సీఎం రేవంత్ కీలక సూచనలు!

ఇక తాను కొండారెడ్డి పల్లి ప్రైమరీ స్కూల్లో, తాండ్ర హైస్కూల్ లో , వనపర్తి హైస్కూల్లో చదువుకున్నానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికే ఈ బడ్జెట్ లో 21 వేల కోట్ల బడ్జెట్ కేటాయించామని చెప్పారు. విద్యార్థులకు మొదటి రోజునే యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు అందిచామని అన్నారు. మళ్లోసారి తనను ముఖ్యమంత్రిగా చూడాలంటే టీచర్లంతా బాగా పనిచేయాలని, విద్యావంతుల తెలంగాణను తీర్చిదిద్దాలని చెప్పారు. దొరలగడీల్లో తెలంగాణ బందీ కావద్దంటే మీరు పేదలకు చదువు చెప్పినప్పుడే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలంటే టీచర్లే బ్రాండ్ అంబాసిడర్లని సీఎం అన్నారు.

#cm-revant #telangana-govt-school #power-free
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe