Telangana : డీఎస్సీ అభ్యర్ధులకు ఫ్రీ కోచింగ్..దరఖాస్తు ఎలా చేసుకోవాలి అంటే..

తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ పడింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అభ్యర్ధులు పరీక్షకు ప్రిపరేషన్ మొదలుపెట్టేశారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్. దీని మీద మరిన్ని వివరాల కోసం కింద చూడండి..

New Update
Telangana : డీఎస్సీ అభ్యర్ధులకు ఫ్రీ కోచింగ్..దరఖాస్తు ఎలా చేసుకోవాలి అంటే..

Free Coaching For DSC Candidates : తెలంగాణ(Telangana) లో మరికొన్ని నెలల్లో డీఎస్సీ ఎగ్జామ్స్(DSC Exams) జరగనున్నాయి. చాలా ఏళ్ళ తర్వాత నోటిఫికేషన్ రావడంతో అభ్యర్ధులు దీని మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు. నోటిఫికేషన్ విడుదల అయిన దగ్గర నుంచీ ప్రిపరేషన్ మొదలుపెట్టేశారు. ఇప్పుడు అభ్యర్ధుల కోసం హైదరాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్(Hyderabad SC Study Circle) బంపర్ ౠఫర్ ప్రకటించింది. డీఎస్సీ ఎగ్జామ్ కోస్ ఫ్రీ కోచింగ్ ఇస్తామని తెలిపింది. దీని కోసం మార్చి 12 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చింది. 26వ తేదీ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు రెండు నెలల పాటూ అభ్యర్ధులకు ఉచిత శిక్షణ ఇవ్వనుంది హైదరాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్.

16 కేంద్రాల్లో ఉచిత శిక్షణ..

ఉచిత శిక్షణ కోసం అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాష్ట్ర వ్యాప్తంగా 16 కేంద్రాల్లో డీఎస్సీ కోచింగ్ ఇస్తామని ఎస్సీ స్టడీ సర్కిల్ తెలిపింది. ప్రతీ కేంద్రంలో 100 మందికి చొప్పున కోచింగ్ ఇవ్వనున్నారు. ప్రభుత్వ డైట్‌, బీఎడ్‌ (B. Ed) కాలేజీలతో పాటు ఇతర కాలేజఈల్లోనూ కోచింగ్ ఇవ్వనున్నారు. కోచింగ్‌కు వచ్చే అభ్యర్థులు డైట్ లేదా టెట్‌ లో పాస్ అయి ఉండాలి. దరఖాస్తు విధానం, ఇతర పూర్తి వివరాలు మార్చి 11వ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్ http://tsstudycircle.co.in/index.html లో అందుబాటులో ఉంటాయి.

ఏప్రిల్ 2 వరకు దరఖాస్తుల స్వీకరణ..

తెలంగాణలో మొత్తం 11,062 ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది. ఇందులో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 ఉద్యోగాలు ఉన్నాయి. వీటి దరఖాస్తు ప్రక్రియ మార్చి 4 నుంచి ప్రారంభం అయింది. అభ్యర్ధులు https://tsdsc.aptonline.in/tsdsc/ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 2వ తేదీ అప్లై చేసుకోవడానికి చివరి గడువు. అంతేకాదు డీఎస్సీ దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీని కోసం అభ్యర్థులు https://tsdsc.aptonline.in/tsdsc/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. Click Here for Direct Recruitment of TS DSC - 2024 అనే అప్షన్ పై క్లిక్ చేయాలి. Edit Post Applied అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి Candidate's Aadhaar No, Payment Reference IDని ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. దీంతో మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన దరఖాస్తును ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్మాత తిరిగి సబ్మిట్ చేయాలి.ఈ ఎడిట్ ఆప్షన్ ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Also Read : Jobs: ఆంధ్ర అటవీశాఖలో ఉద్యోగాలు..నోటిఫికేషన్ రిలీజ్

Advertisment
తాజా కథనాలు