/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/free-bus-service-jpg.webp)
Free Bus Travel for Woman in Telangana : ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా తెలంగాణ(Telangana) లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ఈ స్కీమ్‌ను సజావుగా అమలు చేయడానికి రంగం సిద్ధం చేసే ప్రక్రియను ప్రారంభించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-08-at-4.59.03-PM-jpeg.webp)
మార్గదర్శకాలు జారీ:
ఆర్టీసీ బస్సుల్లో(RTC Buses) మహిళలకు(Women) ఉచిత ప్రయాణంపై గైడ్‌లైన్స్ జారి చేశారు. పథకం విధివిధానాలు ప్రభుత్వం ప్రకటించింది. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణమని చెప్పింది. రేపు(డిసెంబర్ 9) మధ్యాహ్నం నుంచి ఫ్రీ బస్సు సర్వీస్ అమల్లోకి రానుంది. తెలంగాణలో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణం ఉండనుంది. ఇతర రాష్ట్రాల సరిహద్దు వరకు ఉచిత ప్రయాణం సర్వీస్‌లు అందుబాటులో ఉంటాయి. మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్స్‌కు ఉచిత ప్రయాణం ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా పథకం వర్తింపు ఉంటుంది.
ఇక మొదటి వారం రోజుల పాటు ఎలాంటి ఐడెంటి కార్డులు లేకుండానే ప్రయాణం చేయొచ్చు. వాటికి అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రియంబర్స్మెంట్స్ చేస్తుంది. రేపటి నుంచి అమలు చేయాలని టీఎస్ ఆర్టీసీ ఎండీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రేపు(డిసెంబర్ 9) అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుకు అంచనా వ్యయం సంవత్సరానికి రూ. 3000 కోట్లు అవుతుందని సమాచారం.
రేపటి నుంచి మహాలక్ష్మి పథకం.. అమలు గైడ్ లైన్స్..!
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ ఫ్రీ బస్సు..పల్లె వెలుగు,ఎక్స్ప్రెస్ బస్సులలో అవకాశం
➡️ ఆధార్ కార్డు గాని ఏ ఇతర గుర్తింపు కార్డు గాని చూపించవచ్చు
➡️ if ఒకవేళ ప్రయాణం చేసే సమయంలో గుర్తింపు కార్డు లేకపోయినా కూడా అనుమతిస్తారు
➡️ ట్రాన్స్ జెండర్స్ కూడా ప్రయాణం ఉచితం
➡️ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఈ సదుపాయం ఉంటుంది.
➡️ రాష్ట్రంలోని ఎక్కడ నుండి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. అపరిమిత కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు.
మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ పథకం అమలు అవుతుంది
Also Read: నాసిరకం పిచ్‌లు.. పరువు తీసిన బీసీసీఐ.. ఐసీసీ షాకింగ్ రిపోర్ట్!