జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో వంచన: నాదెండ్ల మనోహర్

జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో వైసీపీ సర్కార్ పేదలను వంచిస్తోందని మండిపడ్డారు జనసేన నాదెండ్ల మనోహర్. భూ సేకరణ పేరుతో అవినీతి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీల ద్వారా లబ్ధి పొందింది కేవలం జగన్, వైసీపీ ప్రజా ప్రతినిధులు మాత్రమేనని అన్నారు.

New Update
AP: ఇలా ఉండటం బాధాకరం.. ఇకపై ఈ పరిస్థితి ఉండదు:  మంత్రి నాదెండ్ల

Nadendla Manohar: జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో వైసీపీ సర్కార్ పేదలను వంచిస్తోందని ఆరోపించారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. భూ సేకరణ పేరుతో అవినీతి చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత ఏడాది నవంబర్ లో గుంకలామ్ లోని జగనన్న కాలనీని సందర్శించి వాటి పరిస్థితి చూశారని తెలిపారు. ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్నారని అప్పుడే చెప్పారని అన్నారు. జగనన్న కాలనీల ద్వారా లబ్ధి పొందింది కేవలం సీఎం జగన్, వైసీపీ ప్రజా ప్రతినిధులు మాత్రమేనని అన్నారు నాదెండ్ల మనోహర్. భూసేకరణ పేరుతో వైసీపీ రూ. 35,141 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. ముఖ్యమంత్రి శాసన సభలో చెప్పిన లెక్కలకు, ప్రభుత్వ ప్రకటనలకు పొంతనే లేదన్నారు. నోటికి వచ్చిన లెక్కలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ నాయకుల మధ్య వాటాల పంపకంలో గొడవలు రావడంతో అవినీతి లెక్కలు బయటకు వస్తున్నాయని వ్యాఖ్యనించారు నాదెండ్ల మనోహర్.

Also Read: నందిగామలో టీడీపీ-జనసేన సమావేశం రసాభాస.!

గుంటూరు జిల్లాలో భయంకరంగా అవినీతి చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు, ఆ పార్టీ నాయకులు, అధికారులు.. చివరకు కలెక్టర్ కూడా అని అన్నారు. అయితే, అవినీతికి పాల్పడ్డ ఎవరినీ వదిలేది లేదని తేల్చి చెప్పారు. గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ఈ భూసేకరణపై విజిలెన్స్ విచారణకు డిమాండ్ చేశారని అన్నారు. బురదల్లో, కొండల్లో, ఊరు చివర, శ్మశానాల దగ్గర భూములు ఇచ్చారని.. అక్కడ కాలనీలు నిర్మిస్తామంటే ప్రజలు ఆందోళన చెందారని తెలిపారు. అందుకే 95 వేల మంది లబ్ధిదారులు తమకు ఇళ్ల పట్టాలు వద్దని చెప్పారని అన్నారు.

Also Read: టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా హౌస్ అరెస్ట్

ఈ క్రమంలోనే  భూ సేకరణపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడికైనా వెళ్ళి పరిశీలిద్ధాం. ఎవరి దగ్గర నుంచి భూమి సేకరించారు.. అందుకు చెల్లించిన మొత్తాలు పరిశీలిద్దాం. భూసేకరణ ప్రకటన ముందు రోజు భూమి కొంటారు.. ప్రకటన వచ్చాక ఆ భూమి తీసుకుంటారు. తీసుకున్న మర్నాడే పేమెంట్ చేసేస్తారు. అసలు భూసేకరణ ఎంత పకడ్బందీగా చేయాలి? అలాంటిదేమీ లేకుండా హడావిడిగా కానిచ్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇళ్ల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లలో గృహ నిర్మాణానికి ఇచ్చిన బడ్జెట్ రూ.16,815 కోట్లుని తెలిపారు. అయితే, చేసిన వ్యయం రూ.8250 కోట్లు మాత్రమేనని అన్నారు. అంటే పేదల గృహ నిర్మాణానికి ఇచ్చిన బడ్జెట్లో 50శాతం మాత్రమే ఖర్చు చేశారని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు