Shah Rukh Khan : బాలీవుడ్ బాద్షాకు అరుదైన గౌరవం.. ఆ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ హీరోగా షారుఖ్..!

షారుఖ్ ఖాన్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత గ్రెవెన్‌ మ్యూజియం షారుఖ్ పేరుతో ప్రత్యేక గోల్డ్‌ కాయిన్స్ రిలీజ్ చేసింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగా షారుఖ్ ఖాన్ నిలిచారు. ఆగష్టు 10 న ఈ బంగారు నాణేలను గ్రేవిన్‌ మ్యూజియం విడుదల చేయనుంది.

New Update
Shah Rukh Khan : బాలీవుడ్ బాద్షాకు అరుదైన గౌరవం.. ఆ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ హీరోగా షారుఖ్..!

Bollywood Actor Shah Rukh Khan : బాలీవుడ్‌ బాద్షా షారుఖ్ ఖాన్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత గ్రెవెన్‌ మ్యూజియం షారుఖ పేరుతో ప్రత్యేక గోల్డ్‌ కాయిన్లను విడుదల చేసింది. ఈ ఘనత సాధించిన తొలి బాలీవుడ్‌ నటుడిగా షారుఖ్ ఖాన్ నిలిచారు. గ్రెవెన్‌ మ్యూజియం ఇప్పటికే షారుఖ్ మైనపు విగ్రహాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పుడు ఆయన పేరుతో గోల్డ్‌ కాయిన్లను విడుదల చేయడం మరో రికార్డు.

publive-image

ఈ కాయిన్లపై షారుఖ్ ఫోటోతో పాటు మ్యూజియం పేరు కూడా ఉంది. భారతీయ సినిమా రంగంలో 100కుపైగా సినిమాల్లో నటించడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించినందుకు గాను ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఆగష్టు 10 అవార్డుతో పాటు షారుక్‌ ఖాన్‌ బంగారు నాణేలను గ్రేవిన్‌ మ్యూజియం విడుదల చేయనుంది. దీంతో ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ నటుడిగా షారుక్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.

publive-image

Also Read : మరీ ఇంత చేతకానివాళ్లలా ఉంటే ఎలా? మీకు దమ్ముంటే వాళ్ళను అనండి.. నెట్టింట దుమారం రేపుతున్న అనసూయ ట్వీట్!

షారుఖ్ కు ఇది మరో అంతర్జాతీయ గుర్తింపు కావడం విశేషం. ఇప్పటికే అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, చెక్‌ రిపబ్లిక్, థాయ్లాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల్లో ఆయన మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఇక గత ఏడాది 'డంకి' సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన షారుఖ్.. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు.త్వరలోనే ఆయన నెక్స్ట్ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

Advertisment
తాజా కథనాలు