/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FPIs-jpg.webp)
Stock Market : ఈ నెల మొదటి మూడు వారాల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(FPI) భారతీయ స్టాక్ మార్కెట్(Stock Market) నుంచి ఇప్పటివరకు రూ.13,000 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. భారతీయ షేర్ల అధిక వాల్యుయేషన్, అమెరికా(America) లో బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల ఎఫ్‌పిఐలు విక్రయదారులుగా కొనసాగుతున్నారు. డిపాజిటరీ డేటా ప్రకారం, ఈ ధోరణికి విరుద్ధంగా, విదేశీ పెట్టుబడిదారులు(FPIs) రుణం లేదా బాండ్ మార్కెట్ పట్ల ఉత్సాహంగా ఉన్నారు. ఈ సమయంలో వారు బాండ్ మార్కెట్‌లోకి రూ.15,647 కోట్లను ప్రవేశపెట్టారు.
డేటా ప్రకారం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(FPIs) ఈ నెల (జనవరి 19 వరకు) భారతీయ స్టాక్‌ల నుంచి రూ.13,047 కోట్లను ఉపసంహరించుకున్నారు. జనవరి 17-19 మధ్య కాలంలో రూ.24,000 కోట్లకు పైగా విలువైన షేర్లను విక్రయించారు. అంతకుముందు డిసెంబర్‌లో ఎఫ్‌పిఐ నికర మొత్తంలో రూ.66,134 కోట్లు, నవంబర్‌లో రూ.9,000 కోట్లుగా ఉంది. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ మీడియాతో చెప్పినదాని ప్రకారం ఎఫ్‌పిఐలు(FPIs) అమ్మకాలు చేయడానికి రెండు కారణాలున్నాయి. అమెరికాలో బాండ్లపై ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి. 10 సంవత్సరాల బాండ్లపై రాబడి ఇటీవలి స్థాయి 3.9 శాతం నుంచి 4.15 శాతానికి పెరిగింది. ఇది అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి క్యాపిటల్ ఉపసంహరించుకోవడం కోసం ఇన్వెస్టర్లను(FPIs) ప్రోత్సహించింది.
Also Read: తగ్గినట్టే తగ్గి షాకిచ్చిన బంగారం.. ఎంత పెరిగిందంటే..
భారత్(India) లో షేర్ల వాల్యుయేషన్ ఎక్కువగా ఉండడమే రెండో కారణమని ఆయన చెప్పారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్(HDFC Bank) ఆశించిన ఫలితాల కంటే బలహీనంగా ఉండడంతో ఎఫ్‌పిఐలు(FPIs) పెద్ద ఎత్తున విక్రయిస్తున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నిరాశాజనక త్రైమాసిక ఫలితాలే ఎఫ్‌పిఐల భారీ విక్రయాలకు కారణమని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ కూడా చెబుతున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఎఫ్‌పిఐలు(FPIs) జాగ్రత్తగా వ్యవహరించాయని, అధిక వాల్యుయేషన్ల కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్లలో లాభాలను బుక్ చేసుకున్నాయని ఆయన అన్నారు. ఇది కాకుండా, వడ్డీ రేటుకు సంబంధించిన అనిశ్చితి కూడా వారిని పక్కకు జరిగేలా చేసిందని చెబుతున్నారు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి ముందు వారు ప్రస్తుతం పరిస్థితిని గమనిస్తున్నారు.
Watch this interesting Video :