YCP: విశాఖలో నలుగురు వైసీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేసిన అధిష్టానం.. కారణం ఇదే..!

విశాఖ దక్షణ నియోజకవర్గంలోని నలుగురు వైసీపీ కార్పొరేటర్లను ఆ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

New Update
YCP: విశాఖలో నలుగురు వైసీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేసిన అధిష్టానం.. కారణం ఇదే..!

YCP: విశాఖ దక్షణ నియోజకవర్గంలోని నలుగురు వైసీపీ కార్పొరేటర్లను ఆ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. జీవీఎంసీ 29వ వార్డు కార్పొరేటర్ ఊరుకూటి నారాయణరావు, 31వ వార్డు కార్పొరేటర్ బిపిన్ జైన్ కుమార్, 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు, 37వ వార్డు కార్పొరేటర్ చెన్నా జానకీరామ్ లను పార్టీ సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో  ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Also Read: జూ. ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరు.. బాలయ్యకు కొడాలి నాని కౌంటర్

క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యం

నిన్న వాసుపల్లికి వ్యతిరేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీకి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీని విశాఖలో ఖాళీ చేయ్యడమే తన లక్ష్యం అంటు సవాల్ విసిరారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీలో ముఖ్యనాయకులకు జరిగిన అవమానమే తనకు ఎదురైందని చెప్పుకొచ్చారు. జీవీఎంసీలో సగం మంది కార్పొరేటర్లు వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

Also Read: వైసీపీలో నాలుగో జాబితా మీద నేతల్లో టెన్షన్…ఇంకా కొనసాగుతున్న కసరత్తులు

కారణం ఇదేనా..?

ఇది చీలిక కాదని.. పార్టీలోని పరిస్థితులపై ఎదురౌతున్న వ్యతిరేకతని వ్యాఖ్యనించారు. అయితే, ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 29వ వార్డు కార్పొరేటర్ ఊరుకూటి నారాయణరావు, 31వ వార్డు కార్పొరేటర్ బిపిన్ జైన్ కుమార్, 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు, 37వ వార్డు కార్పొరేటర్ చెన్నా జానకీరామ్ ఈ నలుగురు వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారని.. అందుకే పార్టీ అధిష్టానం వారిని సస్పెండ్ చేసిందని ప్రచారం జరుగుతుంది.

Advertisment
తాజా కథనాలు