Curries Powders: ఈ నాలుగు పౌడర్లు కూరల్లో వేస్తే వ్యాధులు మీ దరిచేరవు

వంటల్లో మసాలా పొడులను వాడడం వల్ల మనకు మంచి టేస్ట్ లభిస్తుంది. అయితే.. ఈ మసాలా పౌడర్లకు బదులుగా పుచ్చకాయ, క‌ర్బూజ, పొద్దు తిరుగుడు, గుమ్మడి గింజల పౌడర్లను ఒక్కసారి వంటల్లో వినియోగిస్తే రుచితో పాటు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

New Update
Curries Powders: ఈ నాలుగు పౌడర్లు కూరల్లో వేస్తే వ్యాధులు మీ దరిచేరవు

Curries Powders: సాధారణంగా మనం వంటల్లో అనేక రకాల మసాలా పౌడర్లు వాడుతూ ఉంటాం. గ్రేవీ కర్రీలు చిక్కగా రావడానికి అందులో పాలు, క్రీమ్‌లు, పెరుగు వంటివి వేస్తుంటాం. ఇలా చేయడం వల్ల వాటి రుచి చప్పగా మారుతుంది. దీంతో ఉప్పు, మసాలాలు అధికంగా వేస్తూ ఉంటాం. కూర రుచి బాగా వచ్చినా ఇలాంటి మసాలాల వల్ల ఆరోగ్యం పాడవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తపోటు, అల్సర్లు, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. గ్రేవీ బాగా రావడానికి క్రీమ్‌లు మాత్రమే కాకుండా కొన్ని పదార్థాలను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నాలుగు రకాల పౌడర్ల వల్ల అధికంగా ఉప్పు, కారం వాడకుండా మంచి టేస్టీ కర్రీలు చేసుకోవచ్చు. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.

కూరల్లో వేసే పొడులు రుచితోపాటు ఆరోగ్యం:

పుచ్చగింజ‌ల‌ల్లో ప్రోటీన్ అధిక మోతాదులో ఉంటుంది. ఈ పొడిని కూరల్లో వాడటం వల్ల రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. స్వీట్‌ డిష్‌లలో కూడా ఈ గింజల పౌడర్‌ను వాడవచ్చు. పుచ్చకాయ గింజలను ఐదు గంటలు నానబెట్టిన తర్వాత పేస్ట్‌ చేసుకుని కూరల్లో వేసుకోవచ్చు. అలాగే క‌ర్బూజ గింజ‌ల పొడిని కూడా వాడుకోవచ్చు. ఇందులో సోడియం ఎక్కువ‌ మొత్తంలో ఉంటుంది. ఉప్పు త‌క్కువ‌గా తినేవారు క‌ర్బూజ గింజ‌ల‌ను వాడ‌డం వ‌ల్ల కూర‌లు టేస్ట్‌గా వస్తాయి. అలాగే పొద్దు తిరుగుడు గింజ‌ల్ని వంటకాల్లో వాడుకోవచ్చు. అంతేకాకుండా గుమ్మడి గింజల పౌడర్‌తో కూడా రుచితో పాటు ఆరోగ్యం వస్తుందని నిపుణులు అంటున్నారు. నాలుగు గింజల పౌడర్‌ను ఒకేసారి కూడా వాడుకోవచ్చని చెబుతున్నారు. వీటితో ప్రొటీన్‌తో పాటు ఫైబర్‌ శరీరానికి అందుతుందని, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని వైద్యులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: ఈ రెండు పనులు చేస్తే మీ జుట్టు పట్టుకుని లాగినా ఊడదు

Advertisment
తాజా కథనాలు