/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/tamil-nadu-fire-accident.jpg)
Tamil Nadu: తమిళనాడు విరుధ్ నగర్ భారీ ప్రమాదం జరిగింది. టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 8 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన తమవారిని చూసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యం అయ్యారు. ఆ కుటుంబ సభ్యులు కన్నీళ్లతో ఆ ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. టపాసుల మందు కలిపే క్రమంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణంపై విచారణ జరుపుతున్నారు. కాగా ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
RTV Exclusive వీడియోలు..