మహారాష్ట్ర (Maharashtra) లోని పూణే (Pune) లో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మృతి చెందిన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. కంటైనర్ ను ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూణే బెంగళూరు హైవే పై స్వామి నారాయణ దేవాలయం, నవ్లే వంతెన సమీపంలో రాత్రి 9: 30 గంటల సమయంలో హైవే పై వెళ్తున్న ఓ ట్రక్కుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో రహదారి పై కంటైనర్ ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Also read: అన్నపూర్ణ దేవిగా దర్శనం ఇస్తున్న బెజవాడ దుర్గమ్మ!
ఈ క్రమంలోనే వెనుక నుంచి మరో ట్రక్కు ఢీకొంది. ఒకేసారి మంటలు చెలరేగడంతో ట్రక్కులో ఉన్నవారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
కాలిపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో ఆరుగురు ఉన్నారు. మృతి చెందిన వారిని ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.