Breaking: మిస్సింగ్ ఎంపీడీవో వెంకట రమణరావు మృతి.. అధికారికంగా నిర్థారించిన పోలీసులు!

గత కొద్ది రోజులుగా అదృశ్యమైన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో మండల వెంకట వెంకటరమణ మృతదేహాన్ని మంగళవారం ఉదయం ఎస్డీఆర్ఎఫ్ బృందం కనుగొంది. ఏలూరు కాల్వలో తూటికాడల మధ్య ఇరుక్కుని ఉన్న మృతదేహాన్ని ఎంపీడీవో వెంకటరమణ మృతదేహంగా పోలీసులు ధృవీకరించారు.

New Update
Breaking: మిస్సింగ్ ఎంపీడీవో వెంకట రమణరావు మృతి.. అధికారికంగా నిర్థారించిన పోలీసులు!

Breaking: గత కొద్ది రోజులుగా అదృశ్యమైన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో మండల వెంకట వెంకటరమణ మృతదేహాన్ని మంగళవారం ఉదయం ఎస్డీఆర్ఎఫ్ బృందం కనుగొంది. ఏలూరు కాల్వలో తూటికాడల మధ్య ఇరుక్కుని ఉన్న మృతదేహాన్ని ఎంపీడీవో వెంకటరమణ మృతదేహంగా పోలీసులు ధృవీకరించారు. ఆయన మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ బృందం కాలువ నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తోంది.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నరసాపురం ఎంపీడీవోగా విధులు నిర్వ‌హిస్తున్న ఎం.వెంకటరమణారావు ఈ నెల 15వ తేదిన మిస్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఆయ‌న భార్య కృష్ణా జిల్లాలోని పెన‌మ‌లూరు పోలీస్ స్టేష‌న్ లో 16 వ తేదీన‌ ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు.

ఈ మిస్సింగ్‌ విషయం గురించి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కూడా అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Also read: మీరు గ్యాస్ గీజర్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి!

Advertisment
తాజా కథనాలు