Former ZP Chairman Pula Nagaraju: వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. తన తండ్రి వివేక హత్య కేసులో న్యాయం జరగదని వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యాలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ మళ్లీ సీఎం అయితే కష్టాలు మరింత ఎక్కువవుతాయన్నారు. వివేకా హత్య కేసులో తనకు న్యాయం జరగాలని కోరారు. నాన్న హత్యలో అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని.. అవినాశ్ కు శిక్ష పడాల్సిందేనని కామెంట్స్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యాలపై టీడీపీ నేతలు మరోసారి దుయ్యబట్టారు.
జగన్మోహన్ రెడ్డి సొంత ఇంటిలో మహిళలకే న్యాయం చేయలేనప్పుడు ఇక రాష్ట్ర ప్రజలకు ఏమి చేస్తారని ప్రశ్నిస్తున్నారు. సొంత చిన్నాన్నను చంపితే అది చంద్రబాబు నాయుడు పై నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు ఏకంగా సొంత చెల్లెలే వైసీపీ హంతకుల పార్టీ అని ఆ పార్టీకి ఓటు వేయొద్దని చెబుతుంటే ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు అనంతపురం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ పూల నాగరాజు.
Also Read: కొత్త పెళ్లి కూతుర్లూ.. ఇది మీ కోసమే.. అత్తమామలను ఫ్లాట్ చేసే చిట్కాలు!
ఈ క్రమంలోనే మొదటి నుండి తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్దపీట వేసిందన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా కచ్చితంగా బీసీలకే అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక ఎటువంటి అభివృద్ధి చేయలేని జగన్ మోహన్ రెడ్డి మరొకసారి గెలుస్తాడని ప్రజలను అన్ని విధాల మోసం చేస్తున్నారన్నారు.
అయితే, ఈసారి జగన్ రెడ్డి ఇక ఇంటికే పరిమితం అవుతారన్నారు. జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇక తాను పోటీ చేసే అంశంపై చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారని అన్నారు. ఆయన ఏమి చెబితే అది తూచే తప్పకుండా శిరసాహించడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు అనంతరం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ పూల నాగరాజు.