Former West Bengal CM Buddhadeb Bhattacharya : బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య(80) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. 2000-2011 వరకు బెంగాల్ సీఎంగా ఆయన వ్యవరించారు. 1977 నుండి 1982 వరకు కాశీపూర్-బెల్గాచియా ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే సమయంలో మధ్య సమాచార, ప్రజా సంబంధాల మంత్రిగా మంత్రిగా పనిచేశారు. 1982లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోసిపూర్ నియోజకవర్గం నుంచి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.
1996లో, 1996 పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి జ్యోతిబసు అనారోగ్యం కారణంగా భట్టాచార్జీకి హోం, పోలీసు శాఖ బాధ్యతలు అప్పగించారు. 1999లో పశ్చిమ బెంగాల్‌కు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. నవంబర్ 6, 2000లో బసు పదవీవిరమణ చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. 2002లో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరోకు ఎన్నికయ్యారు. 2011 వరకు సీఎం హోదాలో కొనసాగారు.
Also Read: కుర్చీ నుంచి లేచి వెళ్లిపోయిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్