Harshavardhan: రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా...కేంద్ర మాజీ మంత్రి ప్రకటన.!

రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు బీజేపీ ఎంపీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్ లో పోస్టు చేశారు. 30 ఏళ్ల రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. కృష్ణా నగర్‌లోని ఈఎన్‌టీ క్లినిక్‌లో వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు.

Harshavardhan: రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా...కేంద్ర మాజీ మంత్రి ప్రకటన.!
New Update

Harshavardhan: కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ డాక్టర్ హర్షవర్థన్ రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ పోస్టు ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 30 ఏళ్ల రాజకీయ జీవితం నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. న్యూడిల్లీలోని కృష్ణా నగర్‌లోని ఈఎన్‌టీ క్లినిక్‌లో వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఐదు పర్యాయాలు శాసనసభకు, రెండు పర్యాయాలు లోక్‌సభకు గెలిచిన హర్షవర్ధన్ ప్రస్తుతం ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే నిన్న బీజేపీ తొలి దశ అభ్యర్థుల జాబితాను ప్రకటించగా హర్షవర్ధన్ పేరును ఆ జాబితాలో చేర్చలేదు. హర్షవర్ధన్‌కు బదులుగా ప్రవీణ్ ఖండేల్‌వాల్‌ను బీజేపీ నామినేట్ చేసింది. ఈ నేపథ్యంలోనే తాను ఎన్నికల రాజకీయాలను వదిలి వైద్య రంగంలోకి వస్తున్నట్లు స్పష్టం చేశారు.

50 సంవత్సరాల క్రితం నేను కాన్పూర్‌లోని GSVM మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోసం చేరినప్పుడు, పేద, సామాన్యులకు సహాయం చేయడం, సేవ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం పట్టుబట్టడంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఢిల్లీ ఆరోగ్య మంత్రిగా, రెండు సార్లు కేంద్ర ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. పోలియో రహిత భారతదేశాన్ని సృష్టించడానికి, కోవిడ్ మహమ్మారిపై పోరాడటానికి, దేశాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మొదటి అడుగులు వేసే అవకాశం తనకు లభించిందని హర్షవర్ధన్ పేర్కొన్నారు.

మూడు దశాబ్దాలకు పైగా నా ప్రయాణంలో నాతో పాటు ఉన్న కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశ చరిత్రలో అత్యంత డైనమిక్ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పనిచేయడం గొప్ప విజయంగా భావిస్తున్నాను అని హర్షవర్ధన్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మరో వీరోచిత పునరాగమనం వస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని.. నేను పొగాకు, మాదకద్రవ్యాల దుర్వినియోగం, వాతావరణ మార్పులు, జీవనశైలి వ్యాధులపై పని చేస్తూనే ఉంటాను అని తెలిపారు. కృష్ణా నగర్‌లోని నా ఈఎన్టీ క్లినిక్ తన సేవల కోసం ఎదురుచూస్తుందని హర్షవర్దన్ తన ట్విట్టర్ పోస్టు ద్వారా వెల్లడించారు.

ఇది కూడా చదవండి:బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం..కరీంనగర్ లో 12న భారీ బహిరంగ సభ..!

#bjp #politics #delhi-news #harshavardhan #former-union-health-minister
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe