ఇమ్రాన్ ఖాన్‌కు షాక్..తోషాఖానా కేసులో మూడేళ్ల జైలు శిక్ష

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పెద్ద షాక్ తగిలింది. తోషాఖానా అవినీతి కేసులో ఆయన్ని దోషిగా ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు దోషిగా నిర్దారించింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు ఇమ్రాన్ ఖాన్‌కు రూ. లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్నప్పుడు పాక్ ప్రభుత్వానికి లభించిన విలువైన బహుమతులను విక్రయించారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేశారు. పాకిస్తాన్‌లో ఉండే ప్రజాప్రతినిధులకు ప్రభుత్వాధికారులు లభించే బహుమతులను తోషాఖానా శాఖలో భద్రపరుస్తారు.

New Update
Pakistan : పాకిస్థాన్‌లో మారుతున్న రాజకీయ సమీకరణలు.. మళ్లీ ఇమ్రాన్‌ ఖాన్‌ పీఎం అయ్యే ఛాన్స్‌..!

Imran Khan Arrested : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు షాక్ తగిలింది. తోషాఖానా(Toshakhana case) అవినీతి కేసులో ఆయన్ని దోషిగా ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు దోషిగా నిర్దారించింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు ఇస్లామాబాద్ కోర్టు అదనపు న్యాయమూర్తి జస్టిస్ హుమాయున్ దిలావర్ ప్రకటించారు. దీంతో పాటు ఇమ్రాన్ ఖాన్‌కు రూ. లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. ఈ తోషఖానాలో వుండే కొన్ని బహుమతులను ఇమ్రాన్ ఖాన్ తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి..

రూ. లక్ష జరిమానాను చెల్లించని పక్షంలో అదనంగా మరో ఆరు నెలల జైలు శిక్ష విధించనున్నట్టు పేర్కొన్నారు. తోషఖానా అనగా వివిధ దేశాల అధినేతలు, ప్రముఖులు, రాయబారులు పాకిస్తాన్ నేతలు, అధికారులకు ఇచ్చే బహుమానాలను భద్రపరిచే శాఖ. ఇది కేబినెట్ డివిజన్ ఆధ్వర్యంలో పని చేస్తుంది. ఈ తోషఖానాలో వుండే కొన్ని బహుమతులను ఇమ్రాన్ ఖాన్ తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) తనకు వచ్చిన విలువైన వాచ్‌తో పాటు మరి కొన్ని వస్తువులను తోషఖానా నుంచి తీసుకుని చట్ట విరుద్దంగా విక్రయించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో బహుమతుల విషయంలో ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చారని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ (ఈసీపీ) తెలిపింది. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్‌పై అనర్హత వేటు వేస్తున్నట్టు వెల్లడించింది.

అప్పట్లో ఈ ఘటన పాక్‌లో సంచలనం రేపింది. ఆ తర్వాత తోషఖానా గిఫ్ట్‌ల వివరాలను దాచి పెట్టారంటూ ఇమ్రాన్ ఖాన్‌పై ఈసీపీ క్రిమినల్ కేసు వేసింది. ఈ కేసులో ఇమ్రాన్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలడంతో శిక్ష విధిస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు. ఇమ్రాన్ ఉద్దేశపూర్వకంగా ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం అందించారని విచారణలో తేలిందని న్యాయమూర్తి వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు